మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'పైసా పరమాత్మ'
Send us your feedback to audioarticles@vaarta.com
కంటెంట్ బేస్డ్తో వచ్చిన 'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో కంటెంట్ బేస్డ్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'పైసా పరమాత్మ'. లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్‌కిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్‌జగత్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'పైసా పరమాత్మ'. సంకేత్, సుధీర్ హీరోలుగా అనూష, బనీష హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండవ షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకులు చిత్ర విశేషాలను తెలియచేసారు.
నిర్మాత విజయ్‌జగత్ మాట్లాడుతూ - ''డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సస్పెన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇటీవల షూటింగ్ ప్రారంభించి నాన్ స్టాప్‌గా హైద్రాబాద్‌లో రిచ్ లోకేషన్లలో షూటింగ్ చేసాం. దీంతో మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. మార్చి ఫస్ట్ వీక్ నుండి రెండవ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మా దర్శకుడు విజయ్‌కిరణ్ చెప్పిన స్టోరి నచ్చి ఎంతో ఇంప్రెస్ అయి సినిమా తీస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. ఇదే ఎనర్జీతో సక్సెస్‌ఫుల్‌గా సినిమాని కంప్లీట్ చేస్తాం. ఇందులో రెండు పాటలు వున్నాయి. కనిష్క అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రీ రికార్డింగ్‌కి ఎక్కువ స్కోప్ వున్న చిత్రం ఇది. సీనియర్ కెమెరామెన్ జి.ఎల్. బాబు మా సినిమాకి ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా ఈ చిత్రం వుంటుంది'' అన్నారు.
దర్శకుడు విజయ్‌కిరణ్ మాట్లాడుతూ - ''ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేస్తూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆడియెన్స్ థ్రిల్ అయ్యేవిధంగా ఈ 'పైసా పరమాత్మ' ఉంటుంది. కొత్త నటీ నటులను పరిచయం చేస్తూ సినిమా తీస్తున్నాం. బిగ్ టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. టెక్నికల్‌గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా నిర్మాత విజయ్‌జగత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంటెంట్‌ని నమ్మి నా మీద కాన్ఫిడెన్స్ తో సినిమా తీస్తున్నారు'' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: కనిష్క, కెమెరా: జి.ఎల్. బాబు, కథ: హరికిరణ్, ఎడిటింగ్: అనిల్ జల్లు, మాటలు: రాకేష్ రెడ్డి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్‌కిరణ్, నిర్మాతలు: విజయ్‌జగత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com