బాలయ్య సర్ స్టార్ కావడానికి కారణం అదే.. ప్రగ్యా జైశ్వాల్ కామెంట్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
అందం, అభినయం పుష్కలంగా ఉన్న నటి ప్రగ్యా జైశ్వాల్. కొంత అదృష్టం కూడా ఉండి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది. అయినప్పటికీ తన హార్డ్ వర్క్, గ్లామర్, నటనతో ప్రగ్యా మంచి అవకాశాలు అందుకుంటోంది. 'కంచె' చిత్రంలో తన పెర్ఫామెన్స్ తో ప్రగ్యా జైశ్వాల్ టాలీవుడ్ మొత్తాన్ని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: 'ఆధార్' అంటున్న సీనియర్ కమెడియన్.. షూట్ స్టార్ట్!
ప్రస్తుతం ప్రగ్యా బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన అఖండ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రగ్యాకు గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ చిత్రంపై కంచె బ్యూటీ బోలెడు ఆశలే పెట్టుకుంది. కరోనా కారణంగా అన్ని చిత్రాల లాగే అఖండ షూటింగ్ కూడా వాయిదా పడింది.
ఇటీవల సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి టాలీవుడ్ చిత్రాల షూటింగ్స్ మొదలవుతున్నాయి. దర్శకుడు బోయపాటి ఇటీవల అఖండ షూటింగ్ ని కూడా ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ప్రగ్యా జైస్వాల్ కూడా జాయిన్ అయింది. తనకెప్పుడూ అఖండ షెడ్యూల్ లో ఎక్కువగా గ్యాప్ వచ్చిన ఫీలింగ్ కలగలేదని అంటోంది ప్రగ్యా.
పరిస్థితులు ఎలా ఉన్నా తాము మాత్రం సెట్స్ లో కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తున్నాం అని ప్రగ్యా తెలిపింది. సెట్స్ లో చిత్ర యూనిట్ సభ్యుల ఆరోగ్యమే మొదట ప్రాధాన్యత అని ప్రగ్యా అంటోంది.
ఇక బాలయ్యపై ప్రగ్యా జైశ్వాల్ ప్రశంసల వర్షం కురిపించింది. బాలయ్య సర్ సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. సెట్స్ లో ప్రతి ఒక్కరితో ఆయన జోకులు వేస్తూ సరదాగా ఉంటారు. సరదాగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఆయన గౌరవం ఇస్తారు. ఇతరుల నుంచి కూడా గౌరవం పొందుతారు. ఈ బెస్ట్ క్వాలిటీనే బాలయ్య సర్ ని స్టార్ గా చేసింది అని ప్రగ్యా అభిప్రాయపడింది.
ఇక ఈ చిత్రంలో తన రోల్ రివీల్ చేసేందుకు ప్రగ్యా ఆసక్తి చూపలేదు. తన పాత్ర స్ట్రాంగ్ గా, యూనిక్ గా ఉంటుందని.. మిగిలిన విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలని ప్రగ్యా అంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com