టైటిల్ మారేస్తేనే రిలీజట‌...

  • IndiaGlitz, [Saturday,December 30 2017]

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ప‌ద్మావ‌తి'. రాజపుత్ర మ‌హారాణి ప‌ద్మావ‌తి జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సంజ‌య్ లీలా భన్సాలీ తెర‌కెక్కించారు. ఇందులో ఖిల్జీ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్‌, రాజా ర‌త‌న్ సింగ్ పాత్ర‌లో షాహిద్ క‌పూర్ న‌టించారు.

ఈ సినిమాను డిసెంబ‌ర్ 1న విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. అయితే రాణీ ప‌ద్మావ‌తిని ఈ చిత్రంలో త‌ప్పుగా చూపిస్తున్నార‌ని రాజ్‌పుత్ క‌ర్ణి సేన‌లు ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. ఈ ఆందోళ‌న‌లు చాలా పెద్ద‌వి కావ‌డంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా సినిమా విడుద‌ల‌ను వ్య‌తిరేకించాయి. దీనికి తోడు యూనిట్ అప్లై చేసిన సెన్సార్ స‌ర్టిఫికేట్ క్లియ‌ర్‌గా లేక‌పోవ‌డంతో సెన్సార్స్ బోర్డు సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదు.

యూనిట్ ఆన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయ‌డంతో...డిసెంబ‌ర్ 28న సెన్సార్ పూర్త‌య్యింది. అయితే సెన్సార్ స‌భ్యులు ఈ సినిమా ప‌ద్మావ‌తి టైటిల్‌ను కాస్తా..ప‌ద్మావ‌త్‌గా మార్చాల‌ని సూచిస్తూ..కొన్ని మార్పులు చేర్పులు సూచించింద‌ట‌. అలాగైతేనే సినిమాను విడుద‌ల చేయాల‌ని కూడా సూచ‌న లొచ్చాయి.