'పద్మావతి'కి రెండు రాష్ట్రాల్లో చుక్కెదురు...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో కూరుకున్న చిత్రం `పద్మావతి`. రాజస్థాన్ మహారాణి పద్మావతి జీవితగాథను సంజయల్ లీలా బన్సాలీ అదే పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో దీపికా పదుకొనే నటిస్తుంటే..చిత్తోర్‌గఢ్ రాజు రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నారు.
ఈ సినిమాను డిసెంబర్ 1న విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించుకుంది. అయితే ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే వివాదాల బాట పట్టింది. చరిత్రను వక్రీకరిస్తున్నారని పలువురు రాజపుత్ సంఘాలు యూనిట్‌పై దాడి చేశాయి. ఎలాగెలాగో విడుదలకు సిద్ధమైన సినిమాకు సెన్సార్ డాక్యుమెంట్స్ అనుకున్న రీతిలో లేకపోవడం వల్ల..సినిమా సెన్సార్ కాలేదు. దీంతో సినిమా వాయిదా పడింది.
సినిమా సెన్సార్ పూర్తైన తమ రాష్ట్రాల్లో విడుదల కానివ్వమని మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలియజేశారు. ఈ సినిమాను కాశ్మీర్లో కూడా నిషేధించే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా విడుదలకు ముందే ఇన్ని అవరోధాలు ఎదుర్కొంటున్న `పద్మావతి` విడుదల తర్వాత ఎన్ని సమస్యలను ఫేస్ చేస్తుందో చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com