'ప‌ద్మావ‌తి' వాయిదా..?

  • IndiaGlitz, [Sunday,November 19 2017]

ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో కూరుకున్న చిత్రం 'ప‌ద్మావ‌తి'. రాజ‌స్థాన్ మ‌హారాణి ప‌ద్మావ‌తి జీవిత‌గాథ‌ను సంజ‌య‌ల్ లీలా బ‌న్సాలీ అదే పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ పాత్ర‌లో దీపికా ప‌దుకొనే న‌టిస్తుంటే..చిత్తోర్‌గఢ్‌ రాజు రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నారు.

ఈ సినిమాను డిసెంబ‌ర్ 1న విడుద‌ల చేయాల‌ని యూనిట్ నిర్ణ‌యించుకుంది. అయితే ఈ సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉండ‌గానే వివాదాల బాట ప‌ట్టింది. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌ని ప‌లువురు రాజ‌పుత్ సంఘాలు యూనిట్‌పై దాడి చేశాయి. ఎలాగెలాగో సినిమాను పూర్తి చేశారు. సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఈ విమ‌ర్శ‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి.

రాజ‌పుత్ర సంఘాల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు కూడా సినిమాపై విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. సినిమా విడుద‌ల‌కు ముందే త‌మ‌కు చూపించాల‌ని ప‌లు సంఘాలు డిమాండ్ చేయ‌డం మొద‌లుపెట్టాయి. దీనిపై సెన్సార్ బోర్డ్ చైర్మ‌న్ ప్రసూన్ జోషి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డ‌మే కాకుండా, సెన్సార్ ద‌ర‌ఖాస్తు అసంపూర్తిగా ఉంద‌ని సినిమాను వెన‌క్కి పంపింది.

దీంతో నిర్మాణ సంస్థ వ‌యోకామ్ 18 సినిమా విడుద‌లను వాయిదా వేయాల‌నుకుంటున్న‌ట్లు త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని తెలియ‌జేస్తామ‌ని సంస్థ తెలిపారు. జ‌న‌వ‌రిలో ప‌ద్మావ‌తి విడుద‌ల ఉండొచ్చున‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

టెన్ష‌న్ ప‌డ్డ హీరోయిన్‌...

మెహ‌బూబా అంటే ప్రేయ‌సి ..పూరి త‌న చిత్రంలో ప్రేయ‌సిని కొత్త కోణంలో చూపెట్ట‌నున్నారు. పూరి డైరెక్ష‌న్‌లో ఆకాష్ పూరి న‌టిస్తున్న చిత్రం 'మెహబూబా'లో మెహ‌బూబాగా నేహాశెట్టి న‌టిస్తుంది.

'మా అసోసియేష‌న్‌' లో యువ‌హీరో వ‌రుణ్‌కి స‌భ్య‌త్వం

యంగ్ ట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు వ‌రుణ్‌. వ‌రుణ్ న‌టించిన 'ల‌జ్జ‌', 'మ‌న‌లో ఒక‌డు' తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన సంగ‌తి తెలిసిందే.

డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న 'దేవిశ్రీ ప్రసాద్' చిత్రం

యశ్వంత్ మూవీస్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం 'దేవిశ్రీప్రసాద్'.  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రంలో    పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్నారు.

అవార్డులు చుట్టాల‌కే... మంచి సినిమాలకు కాదు: హార్మోన్స్ చిత్ర ద‌ర్శ‌క‌,నిర్మాతలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డులు ర‌చ్చ‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా 'హార్మోన్స్'  చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు రోడ్డెక్కారు.

ఛలో అసెంబ్లీ కి తమ్మారెడ్డి భరద్వాజ సపోర్ట్

ఆంధ్ర-తెలంగాణ విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం సహకరించకపోగా.. విభజించి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటివరాకీ ప్రత్యేక రాజధాని నిర్మించుకోడానికి కనీస స్థాయి వెసులుబాటు కలిగించలేదు.