'ప‌ద్మావ‌తి' సాంగ్ రిలీజ్‌...

  • IndiaGlitz, [Wednesday,October 25 2017]

సంజ‌య్ లీలా బ‌న్సాలీ మూవీ మేకింగ్ అంటే..గ్రాండియ‌ర్‌గా ఉంటుంది. ఆ విష‌యం ఆయ‌న సినిమాల‌ను చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'ప‌ద్మావ‌తి'. రాజపుత్ర మ‌హారాణి ప‌ద్మావ‌తిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనె న‌టిస్తుంటే, షాహిద్‌ కపూర్‌ పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో, రణ్‌వీర్ సింగ్‌ సుల్తాన్‌ అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా యుద్ధ స‌న్నివేశాలు, కాస్ట్యూమ్స్ అల్టిమేట్‌గా ఉన్నాయని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. సినిమా 13వ శ‌తాబ్దానికి చెందిన క‌థాంశం కావ‌డంతో..ఆభ‌ర‌ణాల విష‌యంలో ద‌ర్శ‌కుడు సంజ‌య్ స్పెష‌ల్ కేర్ తీసుకుని సినిమా చేస్తున్నాడు.

ఇప్పుడు ఈ సినిమాలో ఘూమ‌ర్ అనే సాంగ్ రిలీజైంది. రాజపుత్ర స్త్రీలు చేసే ఘూమ‌ర్ సాంగ్ చిత్రీక‌ర‌ణ అద్భుతంగా ఉంది. ఈ సాంగ్‌లో దీపిక ప‌దుకొనె నెల‌పాటు ప్రాక్తీస్ చేసింది. ఈ ఒక పాట కోసం 100 మంది 40 రోజ‌లు పాటు క‌ష్ట‌ప‌డి సెట్ వేశారు. ఈ సాంగ్‌లో దీపికా ఇర‌వై కిలోల బ‌రువున్న లెహంగా వేసుకుని డ్యాన్స్ చేయ‌డం విశేషం.