జైలులో పద్మజ కేకలు.. భయపడుతున్న తోటి ఖైదీలు
Send us your feedback to audioarticles@vaarta.com
మదనపల్లె జంట హత్యల కేసులో నిందితుల తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని తెలుస్తోంది. వాళ్లను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించాలన్నా ఎస్కార్ట్ సైతం ఏఆర్ సిబ్బంది ఇంతవరకూ ఇవ్వలేదు. కాగా.. పద్మజ, పురుషోత్తం నాయుడుల ఆరోగ్య పరిస్థితిపై తాజాగా తాజాగా మదనపల్లె సబ్ జైలు సూపరింటెండ్ మీడియాతో మాట్లాడుతూ.. పద్మజ జైలులో కేకలు వేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోందని.. శివుడు వస్తున్నాడని.. కలియుగం అంతమవుతుందంటూ పద్మజ కేకలు పెడుతోందన్నారు.
ఆమె ఉంటున్న బ్యారక్‌లో మహిళలు రాత్రి సమయాల్లో నిద్రించాలంటేనే భయపడుతున్నారని వెల్లడించారు. తరచూ పద్మజ.. ‘శివ.. శివ’ అంటూ అరుస్తోందని రామకృష్ణ యాదవ్ వెల్లడించారు. అయితే ఆమె భర్త పురుషోత్తం నాయుడు మాత్రం ఒంటరిగా ఉంటూ నమస్కారాలు చేసుకుంటున్నారని.. అప్పుడప్పుడు ఏడుస్తున్నారని వెల్లడించారు. వారిని విశాఖకు తరలించాలని తిరుపతి వైద్యులు సూచించారని కానీ ఎస్కార్ట్ కోసం ఏఆర్ సిబ్బంది సహకరించడం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి వారిని విశాఖకు తరలించేందుకు తగిన ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయాలని రామకృష్ణ యాదవ్ కోరారు.
ఇదిలా ఉండగా.. అలేఖ్య ఖాతా సోమవారం ప్రైవేటుగా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే చిన్న కుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా అకౌంట్స్‌పై చర్చ జరుగుతుండగా.. తాజాగా అలేఖ్య ఖాతా ప్రైవేటుగా మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమ కంపెనీలే ఈ ఖాతాలను ప్రైవేటుగా మార్చాయా? లేదంటే ఇతరుల ప్రమేయం ఏమైనా ఉంది అనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద మదనపల్లె ఘటనలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిందితుల మానసిక పరిస్థితి కుదుటపడితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout