విక‌సించిన సినీ ప‌ద్మాలు

  • IndiaGlitz, [Monday,January 27 2020]

కేంద్ర‌ప్ర‌భుత్వం ఈ ఏడాది ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రిచిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను ప‌ద్మ పుర‌స్కారాలు వ‌రించాయి. సినీ రంగం విష‌యానికి వ‌స్తే.. ఈ ఏడాది బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కే ప‌ద్మ అవార్డులు ద‌క్కాయి. ఒక ద‌క్షిణాది సినీ ప్ర‌ముఖుడికి కూడా ప‌ద్మ పుర‌స్కారాలు రాలేదు. బాలీవుడ్ విష‌యానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, కంగ‌నా ర‌నౌత్‌, గాయ‌కుడు అద్నాన్ స‌మీ, మ‌హిళా నిర్మాత ఏక్తాక‌పూర్‌ల‌ను ప‌ద్మ శ్రీ పుర‌స్కారాలు వ‌రించాయి.

కంగ‌నా ర‌నౌత్‌:
ఎలాంటి సినీ నేప‌థ్యంలో లేకుండా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుండి బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగింది కంగ‌నార‌నౌత్‌. అయితే 14 ఏళ్ల ప్ర‌యాణంలో ఆమె ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అనురాగ్ బ‌సు 'గ్యాంగ్‌స్ట‌ర్‌' సినిమాతో సినీ రంగ ప్ర‌వేశం చేశారు. కంగ‌న. ప్యాష‌న్‌తో ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా జాతీయ అవార్డుకు ద‌క్కించుకున్న ఈమె త‌ర్వాత క్వీన్‌, త‌ను వెడ్స్ మ‌ను చిత్రాల‌కుగానూ జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. సినిమాల‌తోనే కాదు..వివాదాల‌తోనూ ఈమె వార్త‌ల్లో వ్య‌క్తిగానే నిలిచారు. మ‌ణిక‌ర్ణి సినిమాతో ద‌ర్శ‌కురాలిగా మారారు కంగనా. త‌న‌కు వ‌చ్చిన ప‌ద్మ‌శ్రీ అవార్డు గురించి కంగ‌నా స్పందిస్తూ ''న‌టిగా నాకు దక్కిన గౌర‌వంగా భావిస్తున్నాను. దైర్యంగా క‌ల‌ల్ని సాకారం చేసుకుంటున్న ప్ర‌తి త‌ల్లికి, చెల్లికి, మ‌హిళ‌కు ఈ అవార్డును అంకిత‌మిస్తున్నాను'' అన్నారు.

క‌ర‌ణ్ జోహార్‌:
నేటిత‌రానికి చెందిన బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో క‌ర‌ణ్ జోహార్ ఒక‌రు. తండ్రి య‌శ్ జోహార్ అడుగు జాడ‌ల్లో సినీ రంగ ప్ర‌వేశం చేశారు. తండ్రి నిర్మాణంలో ద‌ర్శ‌కుడిగా మారారు. సీరియ‌ల్‌లో న‌టుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన క‌ర‌ణ్ జోహార్ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా ప‌లువురు కొత్త న‌టీన‌టుల‌ను హిందీ చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేశారీయ‌న‌.

ఏక్తాక‌పూర్‌:
క్వీన్ ఆఫ్ ఇండియ‌న్ టెలివిజ‌న్‌గా పేరు సంపాదించుకున్నారు ఏక్తాపూర్‌. ఈమె ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు జితేంద్ర త‌న‌య‌గా సినీ రంగ ప్ర‌వేశం చేశారు. తండ్రి స‌హ‌కారంతో బాలాజీ టెలీ ఫిలిమ్స్ సంస్థ‌ను స్థాపించి సీరియ‌ల్స్‌తో పాటు రాగిణి ఎం.ఎం.ఎస్‌, డ‌ర్టీపిక్చ‌ర్‌, ఏక్ విల‌న్‌, ఉడ్తా పంజాబ్‌, వీరే ది వెడ్డింగ్ వంటి ప‌లు చిత్రాల‌ను కూడా నిర్మించారు.

అద్నాన్ స‌మీ:
అద్నాన్ స‌మీ తండ్రి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైలట్‌గా ప‌నిచేశారు. అద్నాన్ లండ‌న్‌లో పుట్టారు. చిన్న‌ప్ప‌ట్నుంచి సంగీతం మీద ప్రేమ‌తో సింగ‌ర్‌గా అవ‌తారం ఎత్తారు. హిందీతో పాటు ప‌లు భాష‌ల్లో పాట‌లు పాడి త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. రీసెంట్‌గానే ఈయ‌న భార‌త‌దేశ పౌర‌స‌త్వం కూడా ల‌భించింది.

More News

కేబినెట్, అసెంబ్లీ సరే.. కేంద్రం సంగతేంటి జగన్..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకున్న పని జరిగి తీరాల్సిందే అన్నంతగా పట్టుబడతారన్న విషయం తెలిసిందే.

స్టార్ హీరో సంస్థ‌పై ఫిర్యాదు చేసిన డైరెక్ట‌ర్

గ‌త ఏడాది ఓ బడా సీనియ‌ర్ క‌థానాయకుడు ఓ హిస్టారిక‌ల్ మూవీలో నటించాడు. స‌ద‌రు హీరో త‌న‌యుడు, ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేసి ఉండ‌టంతో త‌న బ్యాన‌ర్లోనే భారీ బడ్జెట్‌తో సినిమాను తెర‌కెక్కించాడు.

ఆమిర్ కోసం అక్ష‌య్ సినిమా వాయిదా

బాలీవుడ్ స్టార్, మిత్రుడు ఆమిర్ ఖాన్ కోసం మ‌రో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ వెన‌క్కి త‌గ్గాడు.

కండకావురం: జాతీయ జెండాను కాల్చిన సర్పంచ్ తమ్ముడు!

అవును మీరు వింటున్నది నిజమే కండ్లకు కొవ్వు అడ్డపడ్డటంతో ఓ సర్పంచ్ తమ్ముడు జాతీయ జెండాను తగులబెట్టాడు.

ప్రియాంకను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా... బాలీవుడ్ నుండి హాలీవుడ్ సినిమాల్లోకి అడుగు పెట్టింది.