అక్టోబర్ 10న పడిపడి లేచే మనసు చిత్ర టీజర్..
Send us your feedback to audioarticles@vaarta.com
పడిపడి లేచే మనసు సినిమా టీజర్ ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. కోల్ కత్తా, నేపాల్ లోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు హను. ప్రస్తుతం హైదరాబాద్ లో షెడ్యూల్ జరుగుతుంది. షూటింగ్ చివరిదశలో ఉంది పడిపడి లేచే మనసు. ఈ చిత్రంలో మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శర్వానంద్, సాయిపల్లవి నటన సినిమాకు హైలైట్ కానుంది. వీళ్ల కెమిస్ట్రీ ఫస్ట్ లుక్ లోనే అద్భుతంగా వర్కవుట్ అయింది. దర్శకుడు హను రాఘవపూడి టేకింగ్ పడిపడి లేచే మనసుకు మరో హైలైట్. విశాల్ చంద్రశేఖర్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు సంగీతం అందిస్తున్నారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా పడిపడి లేచే మనసు విడుదల కానుంది.
నటీనటులు: శర్వానంద్, సాయిలప్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments