'పడిపడిలేచే మనసు' పూర్తి కావచ్చింది
Send us your feedback to audioarticles@vaarta.com
పడి పడి లేచే మనసు అనగానే శర్వానంద్ సినిమా గుర్తుకొస్తుంది. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా అది. గోల్డెన్ లేడీ సాయి పల్లవి ఇందులో నాయిక. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నేపాల్లోనూ, కోల్‌కతాలోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.
హీరోకి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. అయితే కంప్లీట్ లవ్ స్టోరీ ఇది. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటారనే పేరున్న శర్వానంద్ కి ఈ సినిమాలో ఏం నచ్చిందో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో పాట చిత్రీకరణ జరుగుతోంది. అక్టోబర్ మొదటివారంతో షూటింగ్ పూర్తవుతుంది. అదే నెల్లోనే ఆడియో వేడుకను కూడా నిర్వహిస్తారు. మంచి డేట్ చూసుకుని నవంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout