యూత్ ను ఆకట్టుకునే డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరి పడేసావే - హీరోయిన్ నిత్యా శెట్టి
- IndiaGlitz, [Monday,February 22 2016]
కార్తీక్ రాజు, నిత్యా శెట్టి జంటగా నటించిన చిత్రం పడేసావే. ఈ చిత్రం ద్వారా చునియా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన పడేసావే చిత్రాన్ని ఈనెల 26న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా పడేసావే హీరోయిన్ నిత్యా శెట్టి తో ఇంటర్ వ్యూ మీకోసం...
మీ గురించి..
చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ ఎక్కువ. చైల్డ్ ఆర్టిస్ట్ గా 22 సినిమాల్లో నటించాను. అందులో ఒకటి ఫారిన్ సినిమా. మిగిలినవన్నీ తెలుగు సినిమాలే. హీరోయిన్ గా నా ఫస్ట్ మూవీ పడేసావే.
పడేసావే సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?
ఈ సినిమాకి ఆర్టిస్టుల ఎంపిక పూర్తయింది. సినిమా ఓపెనింగ్ కూడా జరిపోయింది. అయితే నిహారిక అనే క్యారెక్టర్ కి మాత్రం ఎవర్ని ఫైనల్ చేయలేదు. ఈ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను...ఈ ఆడిషన్స్ సెకండ్ హీరోయిన్ కోసం అని తెలియడంతో క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు అనుకున్నాను. అక్కడ డైరెక్టర్ చునియా గార్ని కలసిన వెంటనే నన్నుపడేసారని చెప్పాలి. ఆతర్వాత ఇద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. ఫైనల్ గా పడేసావే లో హీరోయిన్ గా నటించేసాను. ఆ విధంగా ఈ సినిమాలో అవకాశం వచ్చింది.
నిహారిక క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
మన పక్కింటి అమ్మాయిలా నిహారిక క్యారెక్టర్ ఉంటుంది. నేను రియల్ లైఫ్ లో ఎలా ఉంటానో ..నిహారిక క్యారెక్టర్ కూడా అలా ఉండడంతో చాలా ఈజీగా అనిపించింది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.
పడేసావే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కదా..ఇందులో ఉన్న కొత్తదనం ఏమిటి..?
ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఇందులో ప్రేమను చూపించే విధానం కొత్తగా ఉంటుంది
. ప్రతి ఒక్కరు డిపరెంట్ మూవీ అని చెబుతారు. మా సినిమా విషయానికి వస్తే...నిజంగానే డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరి. ఎవరు ఎవర్ని పడేసారు. అలా పడేసిన తర్వాత ఏం జరిగింది..? సమస్య వస్తే ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఇంట్రస్టింగ్ గా ఉంటూ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.
హీరో కార్తీక్ సెట్స్ లో ఎలా ఉండేవాడు..?
కార్తీక్ సెట్స్ లో చాలా సరదాగా ఉండేవాడు. నేను హీరోని అనే ఫీలింగ్ ఏమీ లేకుండా అందరితో కలసిపోయే వాడు. ఏదైనా సీన్ చేసేటప్పుడు ఇద్దరం డిష్కస్ చేసుకుని చేసేవాళ్లం.
పడేసావే...డైరెక్టర్ చునియాకి ఫస్ట్ ఫిలిమ్, మీకు ఫస్ట్ ఫిలిమ్...షూటింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి..?
ఆర్టిస్టుల నుంచి ఫర్ ఫార్మెన్స్ ఎలా ఉండాలనే విషయంలో చాలా క్లారిటీతో ఉండేవారు. ఎప్పుడూ టెన్షన్ పడేవారు కాదు. ఈరోజు ఎన్ని సీన్స్ షూట్ చేయాలి. రేపు సీన్స్ ఏమిటి అనే విషయంలో చాలా క్లారిటీతో ఉండేవారు. చునియా మేడమ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. అందుచేత మేడమ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఎప్పటికీ మరచిపోలేను.
పడేసావే ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గురించి ఏం చెబుతారు..?
పడేసావే అనే చిన్న సినిమాకి అనూప్ మ్యూజిక్ ఇవ్వడం నిజంగా సినిమాకే ఓ హైలెట్ అని చెప్పవచ్చు. ఇదేదో చిన్న సినిమా అనే ఫీలింగ్ తో కాకుండా అనూప్ 100% న్యాయం చేసారు. పడేసావే ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుండడం చాలా సంతోషంగా ఉంది.
మీ ఫేవరేట్ హీరో ఎవరు..?
చిన్నప్పటి నుంచి నాగార్జున గారంటే చాలా ఇష్టం. ఆయనకి బిగ్ ఫ్యాన్ ని. నా ఫస్ట్ మూవీని నాగార్జున గారు ప్రమోట్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?
శోభన్ బాబు అనే సినిమా చేస్తున్నాను. అలాగే తమిళ్ లో కాదల్ కాలమ్ అనే సినిమా చేస్తున్నాను.