'పడేసావే' మగవాళ్ళందరూ చూడాల్సిన సినిమా - నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేషన్స్ బ్యానర్‌పై చునియా దర్శకత్వంలో కార్తీక్ రాజు,నిత్యాశెట్టి, శామ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం పడేసావే`. అనూప్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో విడుదల చేశారు. బిగ్ సీడీని అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఆడియో సీడీలను కె.రాఘవేంద్రరావు విడుదల చేసి తొలి సీడీని రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు అందించారు. ఈ సందర్భంగా...
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ``ఇక్కడకు చునియాపై అభిమానంతో వచ్చిన వారి ఆశీస్సులే చునియాకు పెద్ద అండ. సినిమా నేను చూశాను. ఈ సినిమాకు ముందు చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ వచ్చినా ఇది అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా మగవాళ్ళు చూడాల్సిన సినిమా. ఆడవాళ్ళు వాళ్ళ భర్తలు, బాయ్‌ఫ్రెండ్స్ ఎలా ఉండాలనుకుంటారోనని చెప్పే చిత్రం. ఇప్పుడు నా ఇంట్లో అమల నా గురించి ఏమనుకుంటుందో బాగా తెలుస్తుంది. చునియా టాలెంట్‌పై నమ్మకంతో నేను సపోర్ట్ చేశాను. సినిమా చూడగానే, నాకు కూడా ఓ స్క్రిప్ట్ చెబితే బావుంటుందని అనుకున్నాను. చునియానే సార్..ఓ స్క్రిప్ట్ ఉంది వింటారా అని అడిగింది. ఇప్పుడు చెబుతున్నాను. గేమ్ ఈజ్ ఆన్. సినిమా రిలీజ్ కాక ముందే నేను చెప్పేశాను. సినిమా రిలీజై, హిట్టయిన తర్వాత గేమ్ ఈజ్ ఆన్. అలాగే పాటల పిక్చరైజేషన్ బావుంది. అనూప్ కెరీర్లో మరో హిట్ ఆల్బమ్ ఇది`` అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ``రాజమౌళి, నా దగ్గర, నాగార్జున దగ్గర పనిచేసిన చునియా ఆడియెన్స్‌ను పడేసే టెక్నిక్ బాగానే నేర్చుకుంది. అందుకే పడేసావే అనే టైటిల్‌ను పెట్టుకుంది. మంచి టీంను సెలక్ట్ చేసుకుంది. హీరో హీరోయిన్స్ అందరూ బావున్నారు. సినిమా పెద్ద హిట్టవడం ఖాయం`` అన్నారు.
రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ``మా వైజాగ్ రాజుగారి అబ్బాయి హీరోగా నటిస్తున్న చిత్రం ఎందరో సాధారణ దర్శకులను అసాధారణ దర్శకులుగా మార్చిన నాగార్జున ప్రోత్సాహంతో వస్తున్న చునియా పెద్ద దర్శకురాలు కావాలి. సినిమా పెద్ద విజయం సాధించాలి`` అన్నారు.
ఎ.నాగసుశీల మాట్లాడుతూ ``అనూప్ తన మ్యూజిక్‌తో చాలా సినిమాలకు ప్రాణం పోశాడు. హీరో కార్తీక్ చాలా బావున్నాడు. చునియా గురించి చప్పాలంటే తెలివిగా తన కావాల్సిన పనిని రాబట్టుకుంటుంది. అందరికీ ఆల్ ది బస్ట్`` అన్నారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ``చాలా కొత్త నటీనటులు, టెక్నిషియన్స్ కనపడుతున్నారు. ఫ్రెష్ టీం. నాగార్జునతో వర్క్ చేసిన చునియా పెద్ద దర్శకురాలిగా పేరు తెచ్చుకోవాలి. యంగ్ టాలెంట్‌ను అభినందిస్తున్న నాగార్జునను అభినందిస్తున్నాను`` అన్నారు.
బి.జయ మాట్లాడుతూ `నాగార్జునగారి ప్రోత్సాహంతో చునియా ఒక మంచి లవ్ స్టోరీని డైరెక్ట్ చేసింది. తను పెద్ద దర్శకురాలవుతుంది. ఆమె పెద్ద దర్శకురాలిగా పేరు తెచ్చుకుంటే సంతోషపడే వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ఇంకా ఈ కార్య్రకమంలో బి.గోపాల్, శ్యామ్కె.నాయుడు, కళ్యాణ్ కృష్ణ, లావణ్యత్రిపాఠి, ఎస్.గోపాల్‌రెడ్డి, సుశాంత్, తమ్మారెడ్డి భరద్వాజ సహా హీరో హీరోయిన్స్, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout