close
Choose your channels

నూతన నటీనటులతో పడమటి సంధ్యారాగం లండన్ లో..!

Tuesday, November 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నూత‌న న‌టీన‌టులు చైతు శాంతారామ్, ష‌హేల రాణి జంట‌గా వంశీ మునిగంటి తెర‌కెక్కించిన చిత్రం ప‌డ‌మ‌టి సంధ్యారాగం లండ‌న్ లో. గణేష్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన‌ పడమటి సంధ్యారాగం లండన్ లో చిత్రం ప్రివ్యూ ప్రసాద్ లాబ్స్ లో ప్ర‌ద‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మానికి పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు.
ఈ చిత్రానికి నిర్మాత లండన్ గణేష్. పూర్తిగా లండన్ నేపధ్యంలో ప్రవాస తెలుగు వారి జీవన శైలిని , వారి స్థితిగతులను బ్యాక్ డ్రాప్ లో చక్కని సున్నితమైన ప్రేమ కథను మేళవించి , అద్భుతమైన పాటలు , సాహిత్యం తో అందరిని అలరించే విధంగా చిత్రాన్ని తీశామని దర్శకుడు వంశీ మునిగంటి చెప్పారు
రాజ్ కందుకూరి మాట్లాడుతూ....చక్కని చిత్రాన్ని తీసారు. లైన్ బావుంది. చక్కటి సంగీతం , నటీనటులు చక్కగా నటించారు.ఈ మంచి చిత్రాన్ని అందరూ చూడాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాతకి , దర్శకుడికి అభినందనలు అన్నారు. ఈ కార్యక్రమానికి సంధ్య రవి ,శాంతయ్య త‌దిత‌రులు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment