'పడమటి సంధ్యారాగం' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Sunday,December 27 2015]

గణేష్ క్రియేషన్స్ , బ్యానర్ పై ప్రొడక్షన్ 2గా రూపొందుతోన్న చిత్రం పడమటి సంధ్యారాగం లండన్ లో'. రచన- దర్శకత్వం వంశీ మునిగంటి, లండన్ గణేష్ నిర్మాత. పూర్తి స్థాయిలో లండన్ లో నిర్మించిన మొట్ట మొదటి తెలుగు చిత్రం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే సున్నితమైన ప్రేమ కధతో పాటు విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారి స్థితి గతులను, ఇప్పటి పరిస్థితుల్లో ఇండియా బ్రిటన్ లో ఉన్నసంస్కృతి భేదాలను ఇతివృత్తంగా చూపే కధ ఇది. ఈ చిత్రం ద్వార హీరో చైతు శాంతారాం , హీరోయిన్ శాహేల రాణి , పలు చిత్రాలు నటించిన లండన్ గణేష్ మరో ప్రధాన పాత్రలో ఫెరోజ్ షైక్,ధీరజ్ తోట, రమేష్ ఎసంపల్లి తో పాటు లండన్ లో స్థిర పడ్డ 30 కి పైగా నూతన తెలుగు మరియు బ్రిటిష్ నటి నటులు పరిచయం అవుతున్నారు.

ఈ చిత్ర ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిధిగా పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు. దాసరి నారాయణ రావు గారు వీడియో సందేశం ద్వారా ఆశీస్సులు తెలిపారు . అనంతరం పడమటి సంధ్యారాగం అనే టైటిల్ పెట్టాలంటనే గట్స్ ఉండాలి. అంతే కాకుండా విదేశాల్లో తమ జాబ్స్ చేసుకుంటూనే వీకెండ్స్ లో సినిమాను పూర్తి చేయడం అభినందనీయం. కేశవ్ కిరణ్ అందించిన సంగీతం బావుంది. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అని తమ్మారెడ్డి భరద్వాజ తెలియజేశారు.

నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ 'సినిమాలంటే మంచి ఇంట్రెస్ట్ గణేష్ క్రియేషన్ బ్యానర్ ని స్తాపించి మొదటి చిత్రం "Q ప్రేమకు చావుకు" పూర్తిగా ఇండియా లో నిర్మించి గత మార్చ్ లో రిలీజ్ చేశాను. ఆ చిత్రానికి మంచి టాక్ వచ్చింది ... ఆ చిత్ర అనుభవం తో లండన్ లో కొత్త వాళ్ళని, ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలని రెండో చిత్రంగా పడమటి సంధ్యారాగం తీశాను. ఇందులో భాగంగా దర్శకుడు ,హీరో , ఇతర నటులు కి అవకాశం కలిపిస్తు ఈ చిత్రం నిర్మించడం జరిగింది , ప్రస్తుతం తన మూడో చిత్రం "మనస వాచా" కూడా మరి కొంత మంది కొత్త వారికి అవకాశం కలిపిస్తు లండన్ లో నిర్మిస్తున్నాను. మంచి మ్యూజిక్ కుదిరింది. ఈ చిత్ర నిర్మాణ ప్రక్రియ కూడా సరికొత్త పంధాలో జరిగింది , లండన్ లో స్థిర పడ్డ స్వతహాగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ కేవలం సినిమా మీద ఉన్న ఆసక్తి తో పాటు ఒక మంచి తెలుగు చిత్రాన్నిఅందించాలనే మంచి అభిరుచితో ఈ చిత్రాన్ని నిర్మించాం. సెలవు దినాలు ,వీకెండ్స్ లో ఈ చిత్ర నిర్మాణం జరిగింది , ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ముక్కవోని దీక్షతో అనుకున్నది సాదించే దిశగా ముందుకు సాగాం , వీరికి తోడుగా లండన్ లో ని తెలుగు వారు , తెలుగు అసోసియేషన్స్ కూడా వీరిని ప్రోత్సహించి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.

రచయత దర్శకుడు వంశీ మునిగంటి మాట్లాడుతూ ' దర్శకుడిగా మొదటి చిత్రం. తెలుగుతనం ఉట్టిపడే ఒక చక్కని కధ. అందరూ మెచ్చేలా వినోదాత్మకంగా పూర్తి ఫామిలీ చిత్రాన్ని తీశాం. సాహిత్య విలువలతో కూడిన పాటలు ఈ చిత్రానికి మరో ఆకర్షణ , ప్రేమ , ఎమోషన్స్ , కామెడీ కలిసిన పడమటి సంధ్యారాగం లండన్ లో సినిమా అందరికి నచ్చుతుందని ప్రతి కుటుంబం ఏదో ఒక సీన్ లో గుర్తు చేసుకునే విదంగా తీసామని ,తప్పకుండ మంచి విజయం సాదిస్తుందని భావిస్తున్నాం'' అని చెప్పారు.

సంగీత దర్శకుడు కేశవ్ కిరణ్ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో పనిచేసే అవకాశం కలిగించిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.

సహా నిర్మాతలు సలాం యూసఫ్ , ధీరజ్ తోట ,రమేష్ ఎస్సంపల్లీ , ఫెరోజ్ షేక్ సహకారం అందించిడం ద్వార ఈ చిత్రాని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది .త్వరలోనే ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా పూర్తి చేసుకొని చిత్ర రిలీజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తునట్టు దర్శక నిర్మాతలు తెలిపారు .

చైతు శాంతారాం ,శాహేల రాణి, లండన్ గణేష్, మిరబెల్ స్టువర్ట్, ఫెరోజ్ షేక్, సూర్య, ధీరజ్ తోట, రమేష్ ఎస్సంపల్లి, ఆకాష్ (ఆనందం ఫేం ), జబర్దస్త్ ధనరాజ్ ,జబర్దస్త్ వేణు ,రాములు దసోజు, ధర్మవతి, KN రావు, పద్మ, శ్రవణ కుమార్ గౌడ్, అనిత నోముల, JP Gates ,ఎలెన, బేబీ నిత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా : వర ప్రసాద్, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, సంగీతం : కేశవ కిరణ్, డైలాగ్స్ : వంశీ మునిగంటి , కిట్టు విస్సా ప్రగడ, సాహిత్యం : కిట్టు విస్సా ప్రగడ, కొరియోగ్రఫీ : కెన్ని స్వామినాధన్ , RK , వంశీ మునిగంటి, లైన్ ప్రొడ్యూసర్(ఇండియా ): రాధా కృష్ణ తేలు, సహా నిర్మాతలు : సలాం యూసఫ్ , ధీరజ్ తోట , ఫెరోజ్ షేక్ , రమేష్ ఎస్సంపల్లి , నిర్మాత : లండన్ గణేష్ , రచన,దర్శకత్వం : వంశీ మునిగంటి .