ఇప్పుడు సూర్య అవకాశం ఇస్తాడంటారా?

  • IndiaGlitz, [Monday,July 25 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో క‌బాలి సినిమాను రూపొందించిన ద‌ర్శ‌కుడు పా రంజిత్‌కు విడుద‌ల‌కు ముందు ఉన్న క్రేజే వేరు. విడుద‌ల త‌ర్వాత ప్ర‌శంస‌లు ఎన్ని వ‌చ్చాయో, విమ‌ర్శలు కూడా అన్నే వ‌చ్చాయి. అయితే క‌బాలి కంటే ముందు పా రంజిత్ మ‌ద్రాస్ అనే సినిమా చేశాడు. అది మంచి విజ‌యాన్ని సాధించింది. దాన్ని చూసిన హీరో సూర్య పా రంజిత్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. స్టూడియో గ్రీన్‌తో అగ్రిమెంట్ కూడా పూర్త‌య్యింది. కానీ చివ‌ర్లో ర‌జ‌నీకాంత్ నుండి ఆఫ‌ర్ రావ‌డం, సూర్య కూడా బిజీగా ఉండ‌టంతో పా రంజిత్, ర‌జ‌నీకాంత్‌తో క‌బాలి చేశాడు. ఇప్పుడు వ‌చ్చిన చిక్క‌ల్లా క‌బాలికి మిక్స్‌డ్ టాక్ రావ‌డ‌మే. ఇప్పుడు సూర్య, రంజిత్‌తో సినిమా చేస్తాడా? లేక పున‌రాలోచిస్తాడా అని చూడాలి.