'ఆక్సిజన్' భవిష్యత్ తరాలు తప్పక చూడాల్సిన చిత్రం

  • IndiaGlitz, [Wednesday,December 06 2017]

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్". గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు. గతవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకొంటూ విజయపధంలో దూసుకెళుతోంది.

అయితే.. సినిమా ముఖ్యాంశమైన "టొబాకో నియత్రత్వం" కాన్సెప్ట్ ను మెచ్చిన స్టేట్ హెల్త్ అసోసియేషన్ మరియు "IDA", "Tobacco Intervention Initiative" సంస్థల కోసం నేడు "ఆక్సిజన్" స్పెషల్ షో హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్వాల చైతన్య, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ సత్యేంద్ర, డాక్టర్ పి.కరుణాకర్, డాక్టర్ ఎ.శ్రీకాంత్ మరియు హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.నాగరాజులతోపాటు చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. "సినిమా విడుదలైనప్పుడు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. చాలా ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. విజయవాడ స్టేట్ హెల్త్ అసోసియేషన్ నుంచి శివశంకర్ గారు ఫోన్ చేసి "మేం చేయాల్సిన పనిని మీ సినిమా ద్వారా మీరు చేశారు" అంటూ ఒక అభినందన లేఖ పంపారు. అలాగే.. ఇప్పుడు మా చిత్రాన్ని చూసిన 'IDA' అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కృతజ్నతలు. ఈ చిత్రానికి చాలా అవార్డ్స్ ఎక్స్ ఫెక్ట్ చేస్తున్నాను. ఈ తరానికే కాదు భవిష్యత్ తరాలకు కూడా చాలా ముఖ్యమైన సినిమా 'ఆక్సిజన్' " అన్నారు.

మేము మా ప్రొఫెషనల్ లైఫ్ లో చాలామంది పేషెంట్స్ లో కనిపిస్తున్న సమస్యలను 'ఆక్సిజన్' సినిమాలో చాలా అర్ధవంతంగా చూపించడం జరిగింది. నిజానికి టోబాకో అనేది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా హెల్త్ కి హానికరం. యువత ధూమపానానికి మాత్రమే కాదు, డ్రగ్స్, మందు వంటి అన్నిటికీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంవత్సరానికి 12 లక్షల మంది క్యాన్సర్ కారణంగా చనిపోతుంటే.. వారిలో కేవలం 45% మంది టొబాకో కారణంగా ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు.

నేటి యువతకు అత్యంత ముఖ్యమైన ఈ మెసేజ్ ను సినిమా అనే మాధ్యమం ద్వారా తెలియజెప్పిన దర్శకుడు ఎం.జ్యోతికృష్ణ ను మా 'IDA' సంస్థ ద్వారా ప్రశంసిస్తున్నాం. ఏ.ఎం.రత్నంగారు ఇలాంటి సొసైటీకి పనికొచ్చే చిత్రాలు మరిన్ని నిర్మించాలని కోరుకొంటున్నాం.

ఇలాంటి సమస్యలను మనం రోజూ చూస్తూనే ఉంటాం.. కానీ "ఆక్సిజన్" చిత్రంలో హృద్యంగా తెరకెక్కించడం అభినందనీయం. ఈ సినిమా చూశాక కొందరైనా వారి సిగరెట్ అలవాటును మార్చుకోవాలని ఆశిస్తున్నామన్నారు "ఇండియన్ డెంటల్ అసోసియేషన్" డాక్టర్స్ మరియు హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.నాగరాజు.

More News

మ‌హేష్ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ ఆ రోజేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న సినిమా 'భరత్ అనే నేను' (ప్ర‌చారంలో ఉన్న పేరు).  ఇందులో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

విక్రమ్-సమంతల '10' డిసెంబర్ 15న విడుదల

వెర్సటైల్ యాక్టర్ విక్రమ్, అక్కినేని సమంత జంటగా నటించగా తమిళంలో రూపొంది మంచి విజయం సొంతం చేసుకొన్న చిత్రం '10 ఎండ్రాతుకుల్ల'. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని '10' పేరుతో తెలుగులో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం-ఎం.సుబ్బారెడ్డి-రామారావు చింతపల్లి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిసĺ

'సైరా న‌ర‌సింహారెడ్డి' షూటింగ్ ప్రారంభం

అటు అభిమానులు..ఇటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న‌ 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' బుధ‌వారం అధికారికంగా సెట్స్ కు వెళ్లింది.

మ‌ల‌యాళ రీమేక్‌లో క‌ళ్యాణ్ రామ్‌

నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. ప్ర‌స్తుతం ఎం.ఎల్.ఎ. సినిమాలో నటిస్తున్నారు. ఉపేంద్ర మాధవ్ తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని రూపొందిస్తున్న చిత్రం ఇది. గతంలో 'ఆగడు', 'బ్రూస్ లీ' వంటి చిత్రాలకు ఉపేంద్ర ర‌చ‌యిత‌గా పనిచేసారు.

రిపబ్లిక్ డే రోజు '2.O' టీజర్!

సూపర్ స్టార్ రజనీ కాంత్, ఏస్‌ డైరెక్టర్ శంకర్ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా '2.O'. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌.. ప్రస్తుతం   పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.