నిలిచిపోయిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ అర్థంతరంగా ఆగిపోయాయి. అయితే ఈ నిలిపివేత తాత్కాలికమే అయినా ప్రపంచమంతా ఆక్స్‌ఫర్డ్ అందించనున్న ఈ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలింగా నిలిచిపోవడం నిరాశాజనకంగా మారింది. బ్రిటన్‌కు చెందిన ఓ వలంటీర్ పరిస్థితి వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం విషమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేతపై యూకే ఆరోగ్య కార్యదర్శి స్పందించారు. క్లినికల్ పరీక్షలో పాల్గొన్న యూకేకు చెందిన వలంటీర్ విషయంలో తీవ్రమైన ప్రతికూలత వ్యక్తమైంది. అయితే ఆ వ్యక్తికి ఏం జరిగిందనేది స్పష్టంగా తెలియదు కానీ ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం మాత్రం ఏర్పడింది. అన్ని ప్రతికూలతలనూ అధిగమించి 2021 ప్రారంభంలో టీకా తయారు చేయవచ్చని ఆశిస్తున్నట్టు యూకే ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. అయితే ఏదైనా వ్యాక్సిన్ కానీ ఔషధం కానీ క్లినికల్ ట్రయల్స్‌లో ఇలాంటి అవరోధాలు ఎదురవడం సాధారణమేనని తెలుస్తోంది.
వ్యాక్సిన్ ప్రయోగాల నిలిపివేత విషయాన్ని ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్న ఈ సమయంలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని.. వ్యాక్సిన భద్రత విషయమై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో వివరించింది. ప్రస్తుతం తలెత్తిన సమీక్షపై వీలైనంత త్వరగా సమీక్ష నిర్వహించి వ్యాక్సిన్ ప్రయోగాలను తిరిగి ప్రారంభిస్తామని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. అయితే వలంటీర్‌కు ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తిందనేది మాత్రం ఆస్ట్రాజెనెకా వెల్లడించలేదు. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డెబోరా పుల్లర్ అనే ప్రముఖ పరిశోధకుడు.. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యలు కాకుండా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com