ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు తిరిగి ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల ఆగిపోయిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కోవిడ్ రేసులో ముందుండంతో ప్రపంచ దృష్టి మొత్తం ఈ వ్యాక్సిన్ పైనే ఉంది. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఒకింత నిరాశకు గురైంది. తాజాగా మళ్లీ షురూ అయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా ఈ టీకాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ టీకాను వేయించుకున్న వలంటీరులో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలు నిలిచిపోయాయి. తాజాగా బ్రిటీష్ రెగ్యులేటర్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో బ్రిటన్‌లో తిరిగి వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభించినట్టు ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటనలో తెలిపింది.
ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ బుధవారం అర్థంతరంగా ఆగిపోయాయి. క్లినికల్ పరీక్షలో పాల్గొన్న యూకేకు చెందిన వలంటీర్ విషయంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అయితే ఆ వ్యక్తికి ఏం జరిగిందనేది స్పష్టంగా తెలియదు కానీ ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం మాత్రం ఏర్పడింది. అయితే ఏదైనా వ్యాక్సిన్ కానీ ఔషధం కానీ క్లినికల్ ట్రయల్స్‌లో ఇలాంటి అవరోధాలు ఎదురవడం సాధారణమేనని నిపుణులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments