ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మరో అడుగు ముందుకు పడింది. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ).. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కి పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు డీసీజీఐ వి.జి సొమానీ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎస్ఐఐ వెల్లడించింది. ‘కోవిషీల్డ్’ పేరిట ఈ వ్యాక్సిన్ తయారవుతోంది. కాగా.. ఆక్స్ఫర్డ్ జరిపిన మొదటి రెండు దశల ఫలితాలను విశ్లేషించిన తర్వాత దీనిని భారత్‌తో పరీక్షించేందుకు అనుమతించాలని డీసీజీఐకి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లోని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దీంతో కోవిషీల్డ్‌ను భారత్ ప్రయోగించేందుకు అనుమతి లభించినట్టైంది.
దేశంలో 17 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనుండగా.. వీటిలో విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్‌కి అవకాశం దక్కింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యవంతులైన 18 ఏళ్లకు పైబడిన వారిపై పరీక్షలు నిర్వహిస్తారు. దాదాపు 1600 మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. కాగా.. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిలో 50 శాతం భారత్‌కే కేటాయిస్తామని ఇటీవల కంపెనీ సీఈఓ అదార్ పూణావాలా ప్రకటించారు. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ ధర కూడా వేయిలోపే ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments