Agnipath protest: రణరంగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్... పలు రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ
Send us your feedback to audioarticles@vaarta.com
భారత సైన్యంలో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌ను నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. నిరసనకారులు రైళ్లకు నిప్పు పెట్టడంతో పాటు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో గుంపును చెదరగొట్టేందుకు గాను పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. పలువురు గాయపడ్డారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. అటు ఈ ఆందోళన నేపథ్యంలో ఉత్తర మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది.
ఈ రైళ్ల రాకపోకలపై ప్రభావం:
12303 హౌరా - న్యూదిల్లీ పూర్వా ఎక్స్‌ప్రెస్
12353 హౌరా - లఖ్నవు ఎక్స్‌ప్రెస్
18622 రాంచీ-పట్నా పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్
18182 దనపూర్ - టాటా ఎక్స్‌ప్రెస్
22387 హౌరా - ధన్‌బాద్ బ్లాక్ డైమండ్ ఎక్స్‌ప్రెస్
13512 ఆసన్సోల్ - టాటా ఎక్స్‌ప్రెస్
13032 జైనగర్ - హౌరా ఎక్స్‌ప్రెస్
13409 మాల్డా టౌన్ - కిలు ఎక్స్‌ప్రెస్
పూర్తిగా రద్దైన రైళ్లు :
12335 మాల్డా టౌన్ - లోకమాన్య తిలక్ (టి) ఎక్స్‌ప్రెస్
12273 హౌరా - న్యూదిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
తాత్కాలికంగా రద్దైన రైళ్లు :
13401 భగల్పూర్ - దనపూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
03487 జమల్పూర్ - కిలు డెము ప్యాసింజర్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com