సోము వీర్రాజు అసలు హిందువేనా?: ఓవీ రమణ ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజుపై మాజీ టీటీడీ పాలకమండలి సభ్యుడు ఓవి రమణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తిరుపతిలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఓవీ రమణ మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు ఆలయ పరిరక్షణ పేరుతో చేసే కార్యక్రమాల్లో ఫోటోషూట్ తప్ప ఇంకేమి కనిపించదన్నారు. డిక్లరేషన్ విషయంలో అన్ని పార్టీలు మాట్లాడే భాష, చెప్పే విధానం బాగా లేదని విమర్శించారు. నిమిషానికి వందలాది మంది వెళ్లే పరిస్థితిలో మతం అడగటం తిరుమలలో సాధ్యం కాదన్నారు.
అన్యమతస్థులు కూడా తిరుమలకు రావొచ్చన్నారు. డిక్లరేషన్ తప్పనిసరి కాదని ఓవీ రమణ స్పష్టం చేశారు. ముస్లింలు సమర్పించిన నగలు ఇప్పటికి శ్రీవారి ఆలయంలో పూజల్లో వాడుతున్నారన్నారు. ముస్లింలు కాశీకి సైతం వెళ్తున్నారన్నారు. వేంకటేశ్వర స్వామి.. కొడాలి నానికి బావమరిది అవుతారా అని సోమూ వీర్రాజు మాట్లాడం తగదన్నారు. ఇలా మాట్లాడే వీర్రాజు అసలు హిందువేనా? అని ప్రశ్నించారని సోము వీర్రాజు పేర్కొన్నారు. హిందూమతంపై అక్కర ఉంటే శ్రీనివాసమంగాపురం ఆలయాన్ని పురావస్తు శాఖ నుంచి టీటీడీకి ఇప్పించాలన్నారు. వేంకటేశ్వర స్వామితో రాజకీయ లబ్దికి యత్నిస్తే నాశనం అయిపోతారని పేర్కొన్నారు. అయోధ్యలో మొదటి ఆహ్వానం యోగి ఆదిత్యనాథ్ ముస్లింకు ఇస్తారని తెలిపారు. తిరుమలను మాత్రం ముస్లింలకు దూరం చేస్తారా? అని ఓవీ రమణ ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments