అతిలోక సుందరికి అవుట్ స్టాండింగ్ అవార్డ్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకుని ప్రేక్షక హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోకూడా ఎంట్రీ ఇచ్చి నార్త్ లో కూడా సక్సెస్ సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. తెలుగులో పదహారేళ్ల వయసు, దేవత, ఆకలి రాజ్యం, ఆఖరి పోరాటం...హిందీలో సద్మా, హిమత్ వాలా, మిస్టర్ ఇండియా, ఖుదా గవా...తదితర చిత్రాలు శ్రీదేవికి మంచి పేరు తీసుకువచ్చాయి.కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అతిలోక సుందరికి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఎ) సంస్థ 2016 అవుట్ స్టాండింగ్ ఎఛీవ్ మెంట్ అవార్డ్ ను ప్రదానం చేయనుంది. ఈ నెల 23 నుంచి 26 వరకు స్పెయిన్ రాజధాని మాడరిడ్ లో జరగనున్న వేడుకలో ఈ అవార్డ్ ను అతిలోక సుందరి శ్రీదేవికి అందచేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com