సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న...?
Send us your feedback to audioarticles@vaarta.com
వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు సినీ ప్రేక్షకులకు సినిమా పండుగ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా సంక్రాంతికి విడుదల కానుండగా, మరో వైపు నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతికి రావడం ఖాయమైంది. ఈ రెండు సినిమాలతో పాటు వెంకీ బాక్సింగ్ కోచ్‌గా నటిస్తున్న గురు, నాగార్జున, కె.రాఘవేంద్రరావుల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఓం నమోవేంకటేశాయ సినిమాలు కూడా సంక్రాంతికి వస్తాయని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఇప్పుడు నాగార్జున ఓం నమోవేంకటేశాయ సంక్రాంతికి రావడం లేదని, సినిమాను ఇంకా తెరకెక్కించాల్సి ఉండటం, టెక్నికల్ రీజన్స్‌తో పాటు త్వరత్వరగా పూర్తి చేసి విడుదల చేయడం ఎందుకని యూనిట్ భావిస్తోందట. సినిమాను నింపాదిగానే పూర్తి చేసి ఫిభ్రవరిలో విడుదల చేయాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com