Unstoppable - 2: 'ఆహా' టీమ్‌కి బిగ్ రిలీఫ్.. అన్‌స్టాపబుల్ షోపై ఢిల్లీ హైకోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘‘ఆహా’’లో ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ 2 (Unstoppable2) ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సీజన్లో ఇప్పటికే పలువురు స్టార్స్ ఈ షోకు గెస్ట్లుగా వచ్చారు. ఇక.. ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ఆహా టీమ్ అప్డేట్ ఇచ్చింది. ప్రభాస్ (Prabhas)పాల్గొన్న ఎపిసోడ్‌ను రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సర్ప్రైజ్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఫస్ట్ పార్ట్ ప్రోమోను బుధవారం రిలీజ్ చేశారు. అయితే అన్‌స్టాపబుల్ షో అనధికార ప్రసారాలకి సంబంధించి ఢిల్లీ హైకోర్ట్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. అయితే ఆహా టీమ్‌కి అనుకూలంగా తీర్పు వెలువరించింది.
అసలేంటీ వివాదం :
అన్‌స్టాపబుల్ 2కు సంబంధించిన ఎపిసోడ్లు, ప్రోమోలను కొందరు అనధికారికంగా షేర్ చేస్తున్నారు. షూటింగ్ దశలోనే ఇవి ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తుండటంతో ఆహా నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో అర్హా మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ సంజీవ్ సచ్దేవ్ విచారణ చేపట్టగా.. ఆహా ఓటీటీ తరపున ప్రముఖ న్యాయవాద సంస్థ ఆనంద్ అండ్ నాయక్‌కు చెందిన న్యాయవాదులు అమీత్ నాయక్, ప్రవీణ్ ఆనంద్‌లు వాదనలు వినిపించారు.
ఆ లింకులు తొలగించండి .. కేంద్రానికి న్యాయస్థానం ఆదేశం:
డిసెంబర్ 30న ప్రభాస్‌తో బాలయ్య చేసిన ఇంటర్వ్యూ ప్రసారం కానుందని.. ఇది అనధికారికంగా ప్రసారం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని వీరు న్యాయస్థానాన్ని కోరారు. ఇలాంటి చర్యల కారణంగా షో నిర్వాహకులు ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తోందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ సచ్దేవ్... తదుపరి విచారణ వరకు మధ్యంతర ఇంజెక్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్‌స్టాపబుల్ 2కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వున్న అనధికారిక లింకులను తక్షణం తొలగించాలని కేంద్ర టెలికాం, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖతో పాటు ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com