‘దృశ్యం-2’ రిలీజ్లో ట్విస్ట్: లీగల్ ఫైట్‌కు రెడీ అయిన ఓటీటీ సంస్థ..?
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ, క్రైమ్, సస్పెన్స్ కథాంశంతో వచ్చిన ఆ సినిమా వెంకటేశ్‌కు ఊరట కలిగించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘‘దృశ్యం 2’’ను సైతం తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. అయితే కరోనా, లాక్డౌన్, తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా సస్పెన్స్‌కు తెరదించుతూ నవంబర్ 25న ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ‘‘దృశ్యం 2’’ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మీనా, నదియా, నరేష్, కృతిక, ఎస్తేర్ అనిల్ వంటి మొదటి భాగంలో నటించిన నటీనటులే ‘దృశ్యం 2″లోనూ కనిపించనున్నారు. సంపత్ రాజ్, పూర్ణ సీక్వెల్లో కొత్త పాత్రలను పోషించారు. మలయాళంలో ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించారు.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అయితే ఊహించని విధంగా దృశ్యం 2కి లీగల్ సమస్యలు ఎదురవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఈ సినిమాను దగ్గుబాటి సురేష్ బాబుతో పాటు మరో ఇద్దరు నిర్మాతలు నిర్మించారు. వారిలో ఒకరు డిస్నీ+హాట్ స్టార్‌తో డీల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఒప్పందం సంగతి ఎటూ తేలకముందే తన ప్రొడక్షన్లో వచ్చిన ‘నారప్ప’ సినిమాను రిలీజ్ చేసిన ప్రైమ్ వాళ్లతో సురేష్ బాబు ‘దృశ్యం-2’ విడుదలకు డీల్ కుదుర్చుకున్నట్లుగా సమాచారం. దీంతో హాట్ స్టార్ సంస్ద .. మేకర్స్‌తో లీగల్ ఫైట్‌కు రెడీ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com