'మెగా' తప్పిదానికి క్షమాపణ చెప్పిన ఒటిటి సంస్థ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. లాక్‌డౌన్ కాలంలో ప్రేక్షకులు కామన్‌గానే ఓటీటీలకు అలవాటు పడిపోయారు. దీంతో ‘ఆహా’ పలు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలకు కూడా శ్రీకారం చుట్టింది. వాటిలో సమంత హోస్ట్‌గా చేస్తున్న ‘సామ్ జామ్’ ఒకటి. ఈ షోలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను సమంత ఇంటర్వ్యూ చేశారు. ఈ షో మిగిలిన షోలకు చాలా భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు సైతం బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ షోలో ఓ తప్పిదం జరిగింది. అంతే ఈ షో విషయమై ఓ రేంజ్‌లో రచ్చ జరిగింది. దీంతో ‘ఆహా’ తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పుకోక తప్పలేదు.
అసలు ఏం జరిగిందంటే తాజాగా ఈ షోకి అల్లు అర్జున్ వచ్చాడు. ఈ షో ప్రమోషన్‌లో భాగంగా ‘మెగాస్టార్ అల్లు అర్జున్’ అని పేర్కొన్నారు. అంతే మెగాస్టార్ అభిమానులు మండిపడ్డారు. నెట్టింట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో తప్పు తెలుసుకున్న ‘ఆహా’ యాజమాన్యం దిగిరాక తప్పలేదు. మెగాస్టార్ అభిమానులకు క్షమాపణ చెప్పుకోక తప్పలేదు.‘‘మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరించినందునే మేము చాలా చక్కగా రాణించగలుగుతున్నాం. అయితే ఈ ఏడాది చివరలో మా కారణంగా అనుకోని తప్పిదం జరిగింది. దాని కారణంగా మీరు మమ్మల్ని ఆదరించడం మానేయరని మాకు తెలుసు. మేము చేసిన తప్పిదం కారణంగా బాధపడిన ప్రతి ఒక్కరినీ క్షమించమని కోరుతున్నాం. ఇండస్ట్రీలో ఒకే ఒక్క మెగాస్టార్ ఉన్నారు. ఆయనెవరో మనందరికీ తెలుసు’’ అంటూ ‘ఆహా’ వెల్లడించింది.
అయితే ‘ఆహా’ ఈ తప్పిదాన్ని కావాలని చేసిందా? లేదంటే అనుకోకుండా జరిగిందా? అనేది తెలియడం లేదు. తమ సొంత ఫ్లాట్ ఫాంలో మెగాస్టార్ అల్లు అర్జున్ అని వేయడమేంటని ఇది కావాలని చేసిందేనని చిరంజీవి అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ అంతకు ముందు చిరు ఈ షోకి గెస్ట్‌గా వచ్చారు కాబట్టి బై మిస్టేక్ ఈ తప్పిదం జరిగిందనుకున్నప్పటికీ చిరుతో షో ఆల్రెడీ ప్లే అయిపోయింది. తరువాత బన్నీ ప్రోగ్రాం అనౌన్స్ జరిగింది. కాబట్టి ఇది కావాలని చేసిందేనని చిరు అభిమానుల వాదన. మొత్తానికి ‘ఆహా’ క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com