Weekend Releases: ఈ వారం ఓటీటీ / థియేటర్‌లలో రీలిజయ్యే చిత్రాలివే..

  • IndiaGlitz, [Monday,May 08 2023]

కరోనా తర్వాత వ్యవస్థలో చెప్పలేనన్ని మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొందరికే పరిమితమని అనుకుంటున్న వేళ .. ప్రభుత్వోద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేశారు. అలాగే డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరిగాయి. విద్యా వ్యవస్థలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగం వినోద పరిశ్రమ. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లకు పరిగెత్తేవారు ప్రేక్షకులు. అయితే ఆ సమయంలో ఓటీటీ మార్కెట్ వేగంగా విస్తరించింది. చాలా తక్కువ మొత్తం సబ్‌స్క్రిప్షన్ ఫీజులకే ప్రపంచ నలుమూలలా వున్న అన్ని రకాల వినోదం అరచేతిలోకి వచ్చి చేరింది. దీంతో ఎంతో కంటెంట్ వుంటే తప్పించి థియేటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు ప్రేక్షకులు. దీంతో ప్రతి వారం ఓటీటీలో ఏమేం రిలీజ్ అవుతున్నాయో ప్రత్యేకంగా ప్రకటిస్తున్నారు మేకర్స్.

ఇక ఈవారం కూడా వెండితెర, ఓటీటీ స్క్రీన్‌పై కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. పెద్ద హీరోల సినిమాలు షూటింగ్ దశలో వుండటంతో చిన్న, మీడియం రేంజ్ హీరోలంతా తమ మూవీలను క్యూలో పెడుతున్నారు. వీటిలో కొన్ని థియేటర్‌లలో రిలీజ్ అవుతుండగా.. మరికొన్ని మాత్రం నేరుగా ఓటీటీల్లో స్క్రీనింగ్ కానున్నాయి. వీటికి తోడు థియేటర్‌లో రన్ అయిన కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీ మాధ్యమంలో సందడి చేయనున్నాయి.

కస్టడీ :

వెంకట్ ప్రభుత్వ దర్శకత్వంలో నాగ చైతన్య, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘‘కస్టడీ’’. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. శరత్ కుమార్, ప్రియమణి కీలకపాత్రలు పోషించగ.. అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు.

ఛత్రపతి :

ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన చిత్రం ‘‘ఛత్రపతి’’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌ ఇమేజ్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, నుస్రత్ భరుచా హీరోయిన్‌. మన తెలుగు దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా 12న థియేటర్‌లలో విడుదల కానుంది.

భువన విజయం :

మొత్తం కమెడియన్‌లతో సినిమా వచ్చి టాలీవుడ్‌లో చాలా రోజులు అవుతోంది. ఈ లోటును పూరించేందుకు వస్తోంది ‘భువన విజయమ్’. స్టార్ కమెడియన్లు సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్‌లతో పాటు ధనరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీ ద్వారా యలమంద చరణ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. మే 12న భువన విజయమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది స్టోరీ ఆఫ్ బ్యూటీఫుల్ గర్ల్ :

నిహాల్ కోదాటి, దృషికా చందర్ హీరోహీరోయిన్లుగా రవి ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘‘ ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్’’ ప్రసాద్ తిరువల్లూరి, పుష్యతమి ధవళేశ్వర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. మే 12న ఈ మూవీ విడుదల కానుంది.

కళ్యాణమస్తు :

శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘‘కళ్యాణమస్తు’’ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. బోయపాటి రఘుబాబు నిర్మించగా.. ఒ.సాయి దర్శకత్వం వహిస్తున్నారు.

మ్యూజిక్ స్కూల్ :

సీనియర్ హీరోయిన్ శ్రియా నటిస్తోన్న ‘‘మ్యూజిక్ స్కూల్’’ మే 12న విడుదల కానుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. శర్మాన్ జోషి, షాన్ కీలకపాత్రలు పోషించారు.

న్యూసెన్స్ :

నవదీప్, బిందు మాధవి నటించిన వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగు ఓటీటీ ‘‘ఆహా’’లో మే 12న విడుదల చేస్తున్నారు. మీడియా, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్తూరు జిల్లా చుట్టూ తిరిగే ఈ సిరీస్‌ను శ్రీ ప్రవీణ్ కుమార్ డైరెక్ట్ చేశారు.

దహాద్ :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించిన వెబ్ సిరీస్ ‘దహాద్’ మే 12న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. రీమా కగ్తీ, జోయ్ అఖ్తర్ తెరకెక్కిస్తున్నారు. విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య, సోహమ్ షా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో సోనాక్షి ‘అంజలి భాటి’ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు,

ఇక మిగిలిన ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే :

జీ5:

తాజ్ : ది రీన్ ఆఫ్ రివెంజ్ (హిందీ) (వెబ్ సిరీస్) - మే 12

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

స్వప్న సుందరి (తెలుగు, తమిళం) - మే 12
ది మప్పెట్స్ మేహమ్ ( వెబ్ సిరీస్) - మే 10

సోనీ లివ్ :

ట్రయాంగిల్ ఆఫ్ శాడ్‌నెస్ (హాలీవుడ్ ) - మే 12

జియో సినిమా :

విక్రమ్ వేద (హిందీ) - మే 12

బుక్ మై షో :

ఎస్సాసిన్ క్లబ్ (హాలీవుడ్) - మే 10

నెట్‌ప్లిక్స్ :

బ్లాక్ నైట్ (వెబ్ సిరీస్) - మే 12
రాయల్ టీన్ : ప్రిన్సెస్ మార్గరెట్ (హాలీవుడ్) - మే 11
క్రాటర్ (హాలీవుడ్) - మే 12
ఎరినీ (హాలీవుడ్) - మే 11
ది మదర్ (హాలీవుడ్) - మే 12

అమెజాన్ ప్రైమ్ :

ఎయిర్ (హాలీవుడ్ ) - మే 12

More News

KTR: తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ.. కేటీఆర్ ప్రతిపాదన, ఇళయరాజా గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

Naga Chaitanya:పరశురామ్‌తో వివాదం .. అతని గురించి మాట్లాడటం 'టైమ్ వేస్ట్' , నాగచైతన్య హాట్ కామెంట్స్

అక్కినేని నాగచైతన్య.. ఏఎన్ఆర్ వంశం నుంచి తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన మూడో తరం హీరో.

Navadeep:నా వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదు.. నేను గేని కాను, ఆ రేవ్ పార్టీ జరిగినప్పుడు : నవదీప్ సంచలన వ్యాఖ్యలు

సినిమా అంటే రంగుల ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు ఆవ గింజంత అదృష్టం కూడా వుండాలి.

Maa Oori Polimera 2:'మా ఊరి పొలిమేర‌ -2' పోస్ట‌ర్ లాంచ్ !!

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై  గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో  గౌరికృష్ణ నిర్మాత‌గా డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో

Chiranjeevi:తగ్గేదే లేదంటోన్న మెగాస్టార్.. ఇద్దరు యువ దర్శకులకు గ్రీన్ సిగ్నల్, కూతురిని నిలబెట్టాలనే యత్నం

లేటు వయసులో కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.