40 ఏళ్లలో తొలిసారి.. ఆస్కార్స్ వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ సినిమాలో ఆస్కార్ అవార్డులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఇప్పటి వరకు ఈ అవార్డుల వేడుక ఎప్పుడూ వాయిదా పడలేదు. కానీ కరోనా దెబ్బకు ఎంతో ప్రెస్టీజియస్ ఆస్కార్స్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. వివరాల్లోకెళ్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న ఆస్కార్స్ 93వ వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్నారు. అయితే ప్రపంచం యావత్తు ప్రస్తుత్తం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ అవార్డ్ వేడుకలను రెండు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు అకాడమీ ప్రెసిడెంట్ డేవిడ్ రూబన్ ప్రకటించారు.
కరోనా అందరినీ వణికిస్తోన్న నేపథ్యంలో ఏప్రిల్ 25న ఆస్కార్స్‌ను నిర్వహించాలనుకుంటున్నట్లు రూబన్ తెలిపారు. ప్రపంచం యావత్తు సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో అవార్డుల వేడుకను నిర్వహించడం ఇబ్బంది అవుతుందని అకాడమీ నిర్వాహకులు భావించి... ఆస్కార్స్‌ను వాయిదా వేశారు. 40 ఏళ్లలో ఆస్కార్ అవార్డులను వాయిదా వేయడం ఇదే తొలిసారి. 1981లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్‌పై హత్యాయత్నం జరగడంతో ఈ వేడుకలను వాయిదా వేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout