40 ఏళ్లలో తొలిసారి.. ఆస్కార్స్ వాయిదా

  • IndiaGlitz, [Tuesday,June 16 2020]

ప్రపంచ సినిమాలో ఆస్కార్ అవార్డుల‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఈ అవార్డుల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ అవార్డుల వేడుక ఎప్పుడూ వాయిదా ప‌డ‌లేదు. కానీ క‌రోనా దెబ్బ‌కు ఎంతో ప్రెస్టీజియ‌స్ ఆస్కార్స్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు అధికారికంగా ప్ర‌క‌టించారు. వివ‌రాల్లోకెళ్తే వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 28న ఆస్కార్స్ 93వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌నుకున్నారు. అయితే ప్ర‌పంచం యావత్తు ప్ర‌స్తుత్తం నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా ఈ అవార్డ్ వేడుక‌ల‌ను రెండు నెల‌ల పాటు వాయిదా వేస్తున్నట్లు అకాడ‌మీ ప్రెసిడెంట్ డేవిడ్ రూబన్ ప్ర‌క‌టించారు.

క‌రోనా అంద‌రినీ వ‌ణికిస్తోన్న నేప‌థ్యంలో ఏప్రిల్ 25న ఆస్కార్స్‌ను నిర్వ‌హించాల‌నుకుంటున్న‌ట్లు రూబ‌న్ తెలిపారు. ప్ర‌పంచం యావత్తు సినిమా విడుద‌ల‌లు వాయిదా ప‌డ్డాయి. ఈ త‌రుణంలో అవార్డుల వేడుక‌ను నిర్వ‌హించ‌డం ఇబ్బంది అవుతుంద‌ని అకాడ‌మీ నిర్వాహ‌కులు భావించి... ఆస్కార్స్‌ను వాయిదా వేశారు. 40 ఏళ్ల‌లో ఆస్కార్ అవార్డుల‌ను వాయిదా వేయ‌డం ఇదే తొలిసారి. 1981లో అమెరికా అధ్య‌క్షుడు రొనాల్డ్ రేగన్‌పై హత్యాయ‌త్నం జ‌ర‌గ‌డంతో ఈ వేడుక‌ల‌ను వాయిదా వేశారు.

More News

'ఫ్యామిలీ ప్యాక్' మోషన్ పోస్టర్ విడుదల

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.

'కొంటె కుర్రాడు' టైటిల్ పోస్టర్ విడుదల

ఎస్.ఎమ్.ఫోర్ ఫిలిమ్స్,బ్యానర్ లో మాస్ మహారాజ  రవితేజ అభిమాని ఎమ్.ఎన్.వి.సాగర్ స్వీయ దర్శకత్వంలో

బోల్డ్ రోల్‌తో ఆడియెన్స్‌ ను మెప్పిస్తుందా?

ఈషా రెబ్బా.. వెండితెరపై రాణించాలని ఆరాట‌ప‌డుతున్న తెలుగు హీరోయిన్‌.

నాగ్ నెక్ట్స్ మూవీ ఓకే అయిన‌ట్లేనా?

అగ్ర క‌థానాయ‌కుల్లో కింగ్ నాగార్జున ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సురేంద‌ర్ రెడ్డి ఎటు వైపు మొగ్గుతాడు?

ద‌ర్శ‌కుడిగా ప‌దిహేనేళ్ల కెరీర్ ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది మాత్రం తొమ్మిది సినిమాలు మాత్ర‌మే..