అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ సందడి

  • IndiaGlitz, [Monday,April 26 2021]

ప్రపంచ సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్‌ 93వ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతున్నారు. 'నోమ్యాడ్‌లాండ్' చిత్ర డైరెక్టర్‌ క్లోవీ చావ్‌ ఉత్తమ దర్శకురాలిగా ఎంపికయ్యారు. ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌ సినిమాకు ఆస్కార్‌ అవార్డు లభించింది. ఉత్తమ సంగీతం విభాగంలో సౌండ్‌ ఆఫ్‌ మెటల్ అవార్డును దక్కించుకోగా 'జుడాస్‌ అండ్‌ ది బ్లాక్‌ మిస్సయా' చిత్రంలో నటించిన డానియెల్‌ కలువకోయాకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది.

ఇప్పటి వరకూ ప్రకటించిన అవార్డులు..

ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌ సినిమాకు ఆస్కార్‌ అవార్డు
బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే- ఎమరాల్డ్‌ ఫెన్నెల్‌
'ది ఫాదర్‌' మూవీకి అడాప్టడ్‌ స్క్రీన్‌ప్లే అవార్డు
రైటర్స్‌ క్రిస్ట్‌ఫర్‌ హ్యాంప్టన్‌, ఫ్లోరియన్‌ జెల్లర్‌లకు ఆస్కార్‌
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అనదర్‌ రౌండ్‌(డెన్మార్క్‌)
ఉత్తమ సహాయనటుడు డేనియల్‌ కలూయ(జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మిసయ్య)
ఉత్తమ దర్శకురాలిగా క్లో జావ్ (నొమాడ్ ల్యాండ్)
ఆస్కార్ చరిత్రలో దర్శకత్వం విభాగంలో..
అవార్డ్ గెలుచుకున్న రెండో మహిళ క్లో జావ్
ఆసియాలో మొదటి మహిళ క్లో జావ్

More News

పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాజకీయ, సినీ ప్రముఖులకు

కరోనా ఎఫెక్ట్.. మహిళా కానిస్టేబుల్‌కు స్టేషన్‌లోనే మంగళ స్నానం..

కరోనా మహమ్మారి కారణంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి సెలవులు కూడా దొరకడం లేదు. పెళ్లైనా.. పేరంటమైనా కూడా ఏదో ఒకటి అర సెలవులతో సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం అన్ని

ఆక్సిజన్‌కు బదులుగా నెబ్యులైజర్ వాడకండి!

ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తుంటే.. మరోవైపు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ కొరత కారణంగా ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక చోట పదుల సంఖ్యలో జనం మరణిస్తూనే ఉన్నారు.

సినీ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు..

ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య(74) ఇకలేరు. ప్రస్తుతం హైద‌రాబాద్ చిత్ర‌పురి కాల‌నీలో నివాసముంటున్న ఆయ‌న గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

‘అరవింద సమేత’ను మించి ‘అన్నాత్తె’ లుక్ భయంకరంగా ఉంటుంది: జగపతిబాబు

స్టైలిష్ విలన్ జగపతిబాబు. మరో పాత్ర కోసం సిద్ధమవుతున్నారు. ఆ పాత్రలో ఏ రేంజ్‌లో విలనిజం కనిపిస్తుందంటే.. ‘అరవింద సమేత’లో బసిరెడ్డికి మించి. దాని కోసం ఆయన రిహార్సల్స్ కూడా వేస్తున్నారు.