ఆస్కార్ విజేతలు వీరే
Send us your feedback to audioarticles@vaarta.com
లాస్ ఏంజిల్స్‌లో 92వ అకాడమీ అవార్డుల వేదిక ఘనంగా జరుగుతోంది. హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డులకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండగలా హాలీవుడ్ సెలబ్రేట్ చేసే ఈ అవార్డుల కార్యక్రమంలో జాక్విన్ ఫొనిక్స్‌కు ‘జోకర్’ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. రెనీ జెల్‌వెగర్‌కు ‘జూడీ’ చిత్రానికిగానూ ఉత్తమనటిగా అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా ‘పారాసైట్’ చిత్రం నిలిచింది. ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రానికిగానూ బ్రాడ్ పిట్‌ను ఉత్తమ సహాయనటుడిగా అవార్డుకు సొంతం చేసుకున్నారు. ‘మ్యారేజ్ స్టోరీ’ చిత్రంలో నటించిన లారా డ్రెన్‌కు ఉత్తమ సహాయనటి అవార్డ్ దక్కింది. ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా ‘టాయ్‌స్టోరీ 4’ అవార్డును దక్కించుకుంది.
ఆస్కార్ విజేతలు:
ఉత్తమ నటుడు: జాక్విన్ ఫొనిక్స్(జోకర్)
ఉత్తమ నటి: రెనీ జెల్‌వెగర్ (జూడీ)
ఉత్తమ చిత్రం: పారాసైట్
ఉత్తమ దర్శకుడు: బోన్ జోన్ హో( పారాసైట్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారాసైట్
ఉత్తమ డాక్యుమెంటరీ- అమెరికన్ ఫ్యాక్టరీ
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, ఫిల్మ్ ఎడిటింగ్ - ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్- ద నైబర్స్ విండో
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్- ఇఫ్ యూ ఆర్ ఏ గర్ల్
ఉత్తమ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్ మిక్సింగ్- 1917
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్-హెయిర్ లవ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే- పారాసైట్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే- జోజో ర్యాబిట్
ఉత్తమ ప్రొడక్షన్ ఇన్ డిజైన్-వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్-లిటిల్ ఉమెన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments