'ఒరేయ్ బుజ్జిగా..'మూవీతో మా గోల్ రీచ్ అయినందుకు హ్యాపీగా ఉంది - యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌

  • IndiaGlitz, [Sunday,October 11 2020]

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా...'. రొమ్‌కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ చిత్రం అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న ఆహా ఓటీటీలో విడుద‌లై స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే 4 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సాధించి 5ల‌క్ష‌ల‌కు చేరువ‌వుతున్న సంద‌ర్భంగా హైద‌రాబాద్ ట్రైడెంట్ హోట‌ల్‌లో స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ మీట్ లో స‌క్సెస్ కేక్‌ని క‌ట్‌చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు‌. ఈ సంద‌ర్భంగా..

హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ మాట్లాడుతూ - ఒరేయ్‌ బుజ్జిగా.. రెండున్న‌ర గంట‌ల గ్యారెంటీడ్ ఫ‌న్ ఎంట‌ర్టైన్మెంట్‌. ఈ సినిమా కోసం మా టీమ్ అంద‌రం చాలా క‌ష్ట‌పడ్డాం. అయితే మీ అంద‌రి ఆద‌ర‌ణ చూసిన త‌ర్వాత మా క‌ష్టం అంతా మ‌ర్చిపోయాం. ఒక మంచి సినిమాని ఆహా ద్వారా మీకు చూపించినందుకు మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాలో అన్ని ఎమోష‌న్స్ ప‌లికించే అవ‌కాశం ద‌క్కింది. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు విజ‌య్ గారికి, నిర్మాత రాధా మోహ‌న్ గారికి థ్యాంక్యూ వెరీ మ‌చ్ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - విజ‌య్ గారితో ఇది నా మూడ‌వ ‌సినిమా. పాట‌లు ఇంత బాగా రావ‌డానికి విజ‌య్ కుమార్ గారు స‌గం కార‌ణం. ఆయ‌న స్టోరీలో ఇన్‌బిల్ట్ హ్యూమ‌ర్‌తో పాటు ఒక మంచి ఎమోష‌న్ ఉంటుంది. అందుకే సాంగ్స్‌కి మంచి స్కోప్ ఉంటుంది. మంచి సాంగ్స్ వ‌స్తాయి. ఈ సినిమాలో 'ఈ మాయ‌పేరేమిటో..కృష్ణ‌వేణి, కురిసెన' పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహ‌న్‌గారికి ధ‌న్య‌వాదాలుఅన్నారు.

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - ఒరేయ్ బుజ్జిగా..మూవీ ఇంత బాగా రావ‌డానికి మా అంద‌రి టీమ్ వ‌ర్క్ కార‌ణం. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రి స‌హ‌కారంతోనే ఈ సినిమా పూర్తిచేయ‌గ‌లిగాను. థియేట‌ర్‌లో అయితే విజిల్స్‌, కేక‌లు వేసే ప‌రిస్థితి. అయితే ఆహాలో విడుద‌ల‌చేయ‌డం వ‌ల్ల జ‌రిగిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ ఓవ‌ర్ ది వ‌ర‌ల్డ్ నా ప్రెండ్స్‌, మూవీ ల‌వ‌ర్స్ సినిమా చూసి నాకు కాల్ చేసి సినిమా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తున్నారు. అదే మా టీమ్‌కి స‌క్సెస్‌, ఈ కార‌ణంతోనే స‌క్సెస్‌మీట్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఒక మంచి ఎంట‌ర్‌టైన్ మెంట్ సినిమా చూడాలని అంద‌రూ కోరుకుంటున్నారు. ఇలాంటి త‌రుణంలో ఆహాలో మా సినిమాని రిలీజ్ చేసి ప్రేక్ష‌కుల‌కి ఆనందం క‌లిగించినందుకు ఆహా మేనేజ్‌మెంట్ వారికి నా ధ‌న్య‌వాదాలు. ఆడియ‌న్స్ సినిమా చూసి అప్రి‌షియేట్ చేస్తేనే మేము హుశారుగా స‌క్సెస్‌మీట్ చేయ‌గ‌లుగుతాం. మౌత్ ప‌బ్లిసిటీతోనే ఈ సినిమాకి ఇంత మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. డిజిట‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో మాకు స‌హ‌క‌రించిన ఆహా వారికి అలాగే మ్యాంగో మ్యూజిక్ వారికి థ్యాంక్స్‌ అన్నారు.

ద‌ర్శ‌కుడు విజ‌య్‌కుమార్ కొండా మాట్లాడుతూ - లాక్‌డౌన్‌కి ముందు జ‌రిగిన చివ‌రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌, లాక్‌డౌన్ త‌ర్వాత జ‌రిగిన మొద‌టి ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ అలాగే ఫ‌స్ట్ జ‌రిగిన‌ స‌క్సెస్ మీట్ కూడా మాదే.. సినిమా మొద‌ట‌ ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ అవుతున్న‌ప్పుడు కొన్ని ల‌క్ష‌ల మందితో పాటు మా టీమ్ అంద‌రం కూడా క‌లిసి చూశాం. ఎందుకంటే సినిమా వ‌ర్క‌వుట్ అవుతుంది అని మేం ముందునుండి బ‌లంగా న‌మ్మాం. వ‌ర్క‌వుట్‌ అయ్యింది. సినిమా విడుద‌లైన 24 గంట‌ల త‌ర్వాత ఆడియ‌న్స్ నుండి సినిమా హిట్ అని మాకు నిజ‌మైన రివ్యూ వ‌చ్చింది. ప్రేక్ష‌ల‌కుల‌కి న‌చ్చిన సినిమా ఒరేయ్ బుజ్జిగా.. దాన్ని మించిన స‌క్సెస్ మ‌రొక‌టి ఉండ‌దు. థ్యాంక్యూ వెరీ మ‌చ్‌ అన్నారు.

హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ - మా సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అలాగే మా సినిమా మీకు ఇంత బాగా న‌చ్చినందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము మొద‌లు పెట్టిన‌ద‌గ్గ‌ర‌నుండి అంద‌రికోసం సినిమా చేద్దాం అనుకున్నాం. మా గోల్ రీచ్ అయినందుకు సంతోషంగా ఉంది. సినిమా ఆహాలోనే స‌బ్‌స్క్రైబ్ చేసుకుని చూడండి అన్నారు.

ర‌చ‌యిత నంధ్యాల ర‌వి మాట్లాడుతూ - మా సినిమాను ఆద‌రిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. నేను, విజ‌య్ క‌లిసి ఈ స్క్రిప్ట్‌ని ఎంతో క‌ష్ట‌ప‌డి రాశాం. అంత‌కంటే ఎక్కువ ఇష్ట‌ప‌డి చేశాం. రాజ్ త‌రుణ్‌తో చాలాకాలంగా సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఈ అవ‌కాశం ఇచ్చిన విజ‌య్‌గారికి, రాధా మోహ‌న్ గారికి థ్యాంక్స్‌. అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ ఐ. ఆండ్రూ మాట్లాడుతూ - విజ‌య్ కుమార్ గారితో నా మూడవ హిట్‌ సినిమా. ఆడియ‌న్స్ నుండి మంచి రివ్యూస్ వ‌చ్చాయి. ఆడియ‌న్స్‌కి ఏ సినిమా న‌చ్చితే ఆ సినిమా హిట్. ఈ సినిమా ఆడియ‌న్స్‌కి న‌చ్చింది. ఈ అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్ రాధామోహ‌న్ గారికి థ్యాంక్స్‌ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా న‌టించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

More News

ఆర్జీవీ సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిశ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాంగోపాల్‌వర్మ దిశ సినిమాపై ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల.. టాపర్స్‌లో తెలంగాణ విద్యార్థులు

ఏపీ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్2లో ఇంజినీరింగ్ పరీక్షకు

ఓటు హక్కుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

ఇప్పుడున్న కుర్ర హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. కొన్ని భావాల‌ను ఓపెన్‌గా చెప్ప‌డమే విజ‌య్ దేవ‌ర‌కొండకు ఉన్న అల‌వాటు.

వామ్మో.. రాజమౌళిపై ఇన్ని కంప్లైంట్సా?.. చెర్రీ, తారక్ కూడా..

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి ఇప్పుడు ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. టాలీవుడ్ వ‌ర‌కు ప‌రిమితం అయిన ఈ డైరెక్ట‌ర్ బాహుబ‌లితో ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో పేరును సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.

'పీన‌ట్ డైమండ్' చిత్రం ప్రారంభం

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా రూపొందుతోన్న