ఉగాది కానుకగా వ‌స్తోన్న‘ఒరేయ్‌ బుజ్జిగా...`మంచి విజ‌యం సాధించాలి - మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

  • IndiaGlitz, [Tuesday,March 10 2020]

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...'. ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా మొబైల్ పబ్లిసిటి అనే ఒక కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లు కలిగిన వాహనాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో తిరుగుతాయి. వీటిని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ..- ''ఒరేయ్ బుజ్జిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో అనూప్ రూబెన్స్ సంగీతసారథ్యంలో రాధామోహన్‌గారు ఒక బ్రహ్మాండమైన మూవీని నిర్మించి ఉగాది కానుకగా మార్చి 25నవిడుదలచేస్తున్నారు. మొబైల్ పబ్లిసిటి అనే నూతన టెక్నాలజీ కి కూడా అంకురార్పణ చేశారు. ప్రస్తుత కాలంలో ఈ మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమైనది. తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఎక్కువ జనసందోహం ఉంటుందో అక్కడ వాహ‌నాల ద్వారా ఈ పబ్లిసిటి చేస్తారు.

ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత కె.కె రాధామోహ‌న్ గారికి, దర్శకుడు కొండా విజయ్ కుమార్, రాజ్ తరుణ్, మాళవిక నాయర్, జె మీడియాన‌రేంద‌ర్‌గారికి నా అభినందలు. అలాగే నిర్మాత రాధామోహ‌న్ గారు తీసిన 'ఏమైంది ఈవేళ', 'అధినేత', 'బెంగాల్ టైగర్', 'పంతం' చిత్రాలు చూశాను. మంచి అభిరుచి గ‌ల నిర్మాత. రాధా మోహ‌న్ గారికి ఈ సినిమా పెద్ద‌ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. అలాగే తమ్మడు రాజ్ తరుణ్ ని 'ఉయ్యాలా జంపాల' నుండి ప్రజలందరూ బాగా ఆద‌రిస్తున్నారు. మాళవిక నాయర్ కి ఐదవ చిత్రం వీరితో పాటు టీమ్ అందరికి నా శుభాకాంక్షలు. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతకి మంచి డబ్బులు రావాలి. అలాగే భవిష్యత్ లో కూడా ఇంకా మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

More News

'అన్నపూర్ణ‌మ్మ గారి మనవడు' నాకు ప్ర‌త్యేకం - అన్నపూర్ణ‌మ్మ

చిత్రసీమలో నన్నంతా గౌరవంగా చూస్తారు  "అమ్మబాగున్నావా? అని నవ్వుతూ పలకరిస్తారు అమ్మా అన్నారంటే గౌరవం!

జగన్‌కు, ఏపీ ప్రజలకు థ్యాంక్స్.. మీకు సేవ చేస్తా!

ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరఫున రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత సన్నిహితుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ నత్వానిని

‘ప్రేమపిపాసి’ సక్సెస్ పై  కాన్ఫిడెంట్ గా ఉన్నాం - చిత్ర నిర్మాత  పి ఎస్ రామకృష్ణ(ఆర్‌.కె)

సినిమా రంగంలో రాణించాంటే ప్యాషన్‌ ఉంటేనే సరిపోదు.. పక్కా ప్రణాళిక కూడా అవసరమే అంటున్నారు నిర్మాత రామకృష్ణ(ఆర్‌.కె).

సీసాలతో కొట్టడమేంటి.. చంపేస్తారా..? : ప్రకాష్ రాజ్

తెలుగు బిగ్ బాస్-3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కొన్నిరోజుల క్రితం పబ్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రిషిక్ రెడ్డి గచ్చిబౌలిలోని

పాన్ ఇండియా సినిమా నుండి త‌ప్పుకున్న నాగ్‌!!

బాహుబ‌లి, కె.జి.య‌ఫ్ పార్ట్ 1 త‌ర్వాత ద‌క్షిణాది నుండి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా విడుద‌ల‌వుతున్నాయి.