మ‌హానాయకుడు కోసం అదేశాలు వ‌చ్చేశాయి...

  • IndiaGlitz, [Wednesday,February 27 2019]

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రెండో భాగం 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' గ‌త శుక్ర‌వారం విడుద‌లైంది. సినిమాకు పెద్ద‌గా వ‌సూళ్లు లేవు. సినిమా డిజాస్ట‌ర్ అవుతుంద‌నే కార‌ణంతో పాటు పార్టీకి ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని టాక్ రావ‌డంతో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర సినిమా టికెట్స్ 50 శాతం అమౌంట్‌ను పార్టీయే భ‌రిస్తుంది.

కాబ‌ట్టి పార్టీలో అన్నీ విభాగాల‌కు చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సినిమా చూడాలంటూ తెలుగుదేశం కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు బచ్చుల అర్జునుడు అదేశిస్తున్న‌ట్లు ఓ లెట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో పార్టీ నాయ‌కుడు చంద్ర‌బాబు ఆదేశాల ప్ర‌కారం అని రాసి ఉండ‌టం ఇప్పుడు పార్టీకి మరింత త‌ల‌నొప్పులు తెచ్చే ప‌రిస్థితి నెల‌కొంది. దీనిపై ఇప్పుడు టీడీపీ పెద్ద‌లు ఏమ‌ని సమాధాన‌మిస్తారో చూడాలి.