సీడీలు బయటకు రాకుండా చూడాలంటూ కోర్టుకెక్కడమేంటి?: విపక్షం ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
జలవనరుల మంత్రి రమేశ్ జార్కిహొళి అశ్లీల వీడియో బయటకు రావడం, ఆయన పదవి పోవడం తెలిసిందే. పదవి సంగతేమో కానీ ప్రస్తుతం ఆయన బయట తిరిగే పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేకుండా పోయింది. ఈ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీంతో కర్ణాటకలో వీడియో సీడీలంటేనే మంత్రులు వణికిపోతున్నారు. ఇప్పటికే తమకు చెందిన సీడీలు ఏవైనా ఉంటే వాటిపై పత్రికలు, టీవీ చానెళ్లలో వార్తా ప్రసారాలు రాకుండా చూడాలని పలువురు మంత్రులు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్లను వేశారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలిపింది. వెంటనే తాత్కాలిక అనుమతి ఇచ్చింది.
సిటీ సివిల్ కోర్టు వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం శివరాం హెబ్బార్, బీసీ పాటిల్, హెచ్‌టీ సోమేశేఖర్, కె.సుధాకర్, నారాయణగౌడ, బైరతి బసవరాజు ఉన్నట్లు తెలిసింది. అయితే మంత్రుల పిటిషన్లపై విపక్ష నేతలు మాత్రం మండిపడుతున్నారు. పిటిషన్లు వేసిన వారిని కేబినెట్ నుంచి తొలగించాలంటూ జేడీఎస్ ఎమ్మెల్యే మహేష్ డిమాండ్ చేశారు. తప్పు చేయని వారైతే ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారని ఆయన ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే వీడియోలు బయటకు వస్తే తమ బండారమంతా బయటపడుతుందని భయపడుతున్నారని ఆరోపించారు. ముంబైకి వెళ్లిన మంత్రులు అక్కడ ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలియాలని మహేష్ డిమాండ్ చేశారు.
మంత్రులు కోర్టును ఆశ్రయించడాన్ని కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ కూడా తప్పుబట్టారు. సీడీలను విడుదల చేయవద్దని కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసరంగా కోర్టుకెళ్లారన్నారు. శనివారం బెంగళూరు కేసీ జనరల్ ఆస్పత్రిలో సదానంద గౌడ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాసలీలల సీడీపై పార్టీ జాతీయ అధ్యక్షునికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సమాచారం పంపించారని... మీడియాలో వచ్చిన వార్తలనూ నాయకత్వానికి పంపారని వెల్లడించారు. ఇలాంటి ఘటనల్లో నైతిక విలువలకు ప్రాధాన్యమివ్వాలని సదానంద గౌడ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout