ఆపరేషన్ 'నిజాముద్దీన్'.. మర్కజ్ వెళ్లిన వారి జాబితా రెడీ!
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ ముస్లింల ప్రార్థనల వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ సదస్సుకు ఎక్కడెక్కడ్నుంచి వచ్చారో..? వీరందరికీ ఎవరు అనుమతిచ్చారో..? అర్థం కాని పరిస్థితి. అయితే.. ఈ వ్యవహారాన్ని మొట్ట మొదట తెలంగాణ ప్రభుత్వమే బయటపెట్టింది.. అంతేకాదు కేంద్రాన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది కూడా గులాబీ సర్కారే. ఈ తరుణంలో మర్కజ్ వెళ్లొచ్చిన వారి లెక్కలు తేల్చాలని ప్రభుత్వం సిద్ధమైంది.
లిస్ట్ రెడీ.. వాట్ నెక్స్ట్!
మొదట ఈ జమాత్‌కు వెళ్లిన వారు వెయ్యి మంది మాత్రమే అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత రాష్ట్రం నుంచే 2200 మంది వెళ్లారని తేలినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి హాజరైనవాళ్ళ వివరాల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 2 వేల మందికి టెస్టులు చేసి వారిని క్వారెంటైన్‌కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి ఢిల్లీ మర్కజ్లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లిన వాళ్ళ లిస్ట్ తెలంగాణ ప్రభుత్వం దగ్గర రెడీగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైందని సమాచారం. గత 15 రోజులుగా వాళ్ళు ఎవరితో క్లోజ్‌గా ఉన్నారు..? ఎవరెవర్ని కలిశారు..? అనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిమగ్నమయ్యాయి.
ఎవరెవర్ని కలిశారో..!?
కరోనా కట్టడికిగాను వాళ్లందర్నీ క్వారెంటైన్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒకేరోజు 6 గురు చనిపోవడంతో.. భయాందోళనకు గురై స్వచ్ఛందంగా వచ్చి 700 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇదంతా మంగళవారం జరిగిన తంతు. అయితే..సోమవారం 1300 మందికి పరీక్షలు చేసి వారిని కూడా క్వారెంటైన్‌కు తరలించిన విషయం విదితమే. మరో 200 మందిని గుర్తించి టెస్టులకు పంపేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మర్కజ్ వెళ్లినవాళ్ళ లిస్ట్ కొలిక్కి రావడంతో వాళ్ళ క్లోజ్, క్యాజువల్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌పై అధికారులు, ఇంటెలిజెన్స్ దృష్టి సారించింది. తబ్లీగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వాళ్ళు తిరిగిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తుల వివరాల సేకరణకు కమ్యూనిటీ సపోర్టు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తెలంగాణాలో 82 మంది విదేశీ తబ్లీగీలు ఉంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.!. మరి ఫైనల్‌గా ఏం తేలుతుందో..? లిస్ట్ అధికారికంగా ఎప్పుడు బయటికొస్తుందో..? పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుందో..? వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout