'వైన్ షాపులు తెరవండి.. ఆల్కహాల్‌ తాగితే కరోనా పోతుంది!’

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు విరుగుడు ఏంటో ఇప్పటికీ తెలియట్లేదు.. ఎప్పుడు వ్యాక్సిన్ కనుగొంటారో కూడా తెలియట్లేదు. అయితే నేతలు మాత్రం ఇదిగో అదుగో.. ఇలా చేయండి.. అలా చేయండి అని చెప్పి ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా ఇంకో అడుగు ముందుకేసి ఇదిగో ఇలా చేస్తే వైరస్‌ను మట్టుబెట్టొచ్చు.. ఈ సలహా పాటించండి అని చెబుతున్నారు. సంగోడ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ ఈ హడావుడి చేశారు.

మద్యం షాపులు తెరవండి..

‘రాష్ట్రంలో మద్యం షాపులు తెరవండి. ఆల్కహాల్‌తో చేతులు కడిగినప్పుడు కరోనావైరస్ పోతుంది. అంతేకాదు అదే మద్యం తాగినప్పుడు గొంతు నుంచి కూడా వైరస్ పోతుంది. దయచేసి మద్యం షాపులు తెరవండి’ అని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ సంస్థ ప్రకటించింది. లాక్‌డౌన్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా మద్యం లభించడం లేదని.. తద్వారా రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో నష్టం జరుగుతోందని ఆ లేఖలో ప్రస్తావించారు. ఒరిజనల్ మందు దొరక్క.. నకిలీ మద్యం తాగి ఇద్దరు యువకులు చనిపోయారని అందుకే మద్యం షాపులు తెరవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను లిక్కర్ ద్వారా 12 వేల కోట్ల ఆదాయాన్ని రాజస్థాన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పుడు లిక్కర్ అమ్మకాలు ఆగిపోవడం వల్ల ఆ ఆదాయం వచ్చేలా కనిపించడం లేదని వెల్లడించారు.

కేసుల సంఖ్య ఇదీ..

ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,993 కేసులు నమోదవటంతో మొత్తం కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 35,043కు పెరిగాయి. ఈ విషయాన్ని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 25,007 కేసులు కొనసాగుతున్నాయని.. 8,888 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న ఒక రోగి వేరే దేశానికి వెళ్లిపోయారు. దేశంలో వైరస్ వల్ల గడచిన 24 గంటల్లో మరో 73 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,147కు పెరిగింది. అత్యధికంగా మహారాష్ట్రలో 10,498 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మృతుల సంఖ్య 459గా ఉంది. రెండో స్థానంలోని గుజరాత్‌లో 4,395 కేసులు ఉంటే.. 214 మంది చనిపోయారు. న్యూ ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,515 కాగా, ఇప్పటివరకూ 59 మంది వైరస్‌కు బలయ్యారు.

More News

మ‌హేశ్‌, చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సినిమా?

ఇప్పుడిప్పుడు టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ పెరుగుతోంది. తార‌క్‌, చ‌ర‌ణ్ క‌లిసి మోస్ట్ ప్రెస్టీజియ‌స్ మ‌ల్టీసారర్ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

స్టైల్ మారుస్తున్న శేఖ‌ర్ క‌మ్ముల‌!!

డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల అంటే మ‌న‌కు వెంట‌నే ఫీల్ గుడ్ సినిమాలే గుర్తుకు వ‌స్తాయి. ఆయ‌న తెర‌కెక్కించిన ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాల‌ను మ‌నం అంత సుల‌భంగా మ‌ర‌చిపోలేం.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సుక్కు సినిమా?

వైవిధ్య‌మైన కాన్సెప్ట్‌, బ్యాక్‌డ్రాప్‌తో సినిమాను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో సుకుమార్ ఒక‌రు. ఈ డైరెక్ట‌ర్ సినిమా వ‌చ్చి అప్పుడే రెండేళ్ల‌కావ‌స్తుంది. ఎందుకంటే రామ్‌చ‌ర‌ణ్‌తో రంగ‌స్థ‌లం

బాల‌య్యతో మ‌ళ్లీ మూవీ చేయాల‌నుకుంటున్న యంగ్ డైరెక్ట‌ర్‌

కుర్ర ద‌ర్శ‌కులు ఈ మ‌ధ్య కొత్త కొత్త కాన్సెప్టుల‌తో స‌త్తా చాటుతున్నారు. మంచి విజ‌యాల‌ను ద‌క్కించుకుంటున్నారు. స‌క్సెస్‌ఫుల్‌గా ట్రావెల్ అవుతున్న యంగ్ డైరెక్ట‌ర్స్‌లో అనీల్ రావిపూడి ఒక‌రు.

బుట్ట‌బొమ్మ‌కు మ‌రో క్రెడిట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది.