టాప్ టెన్ లో ఊపిరి...
Thursday, April 7, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఊపిరి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో నిర్మించింది. ఊపిరి చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ముఖ్యంగా యు.ఎస్ లో ఊపిరి రికార్డు స్ధాయి కలెక్షన్స్ తో రన్ అవుతుంది. కేవలం ఐదు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ దాటడం విశేషం. ఊపిరి ప్రస్తుతం $1.414 మిలియన్స్ వసూలు చేసింది. దీంతో యు.ఎస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ టెన్ మూవీస్ లో ఊపిరి స్ధానం దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఊపిరి చిత్రం నేటికీ మంచి షేర్స్ వసూలు చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments