బాలీవుడ్ లో ఊపిరి
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున - కార్తీ - తమన్నా కాంబినేషన్లో రూపొందిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. పి.వి.పి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఊపిరి చిత్రాన్ని నిర్మించింది. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఊపిరి చిత్రం రిలీజ్ అవుతుంది. ఇన్ టచ్ బుల్స్ బాలీవుడ్ రీమేక్ రైట్స్ ను కరన్ జోహార్ తీసుకున్నారు.
బాలీవుడ్ లో ఊపిరి రీమేక్ ని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే చేస్తారా అని డైరెక్టర్ వంశీ పైడిపల్లిని అడిగితే...అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ అవుతాననుకోలేదు. డైరెక్టర్ అయిన తర్వాత పెద్ద స్టార్స్ తో సినిమాలు తీస్తానను అనుకోలేదు. కానీ..ఇవన్నీ జరిగాయి. ఎందుకు అలా జరిగాయి అంటే నేను విధిని నమ్ముతాను. అందుకే అలా జరిగాయనుకుంటున్నాను. అలాగే హిందీలో ఊపిరి ని డైరెక్ట్ చేసే అవకాశం నాకు వస్తే తప్పకుండా చేస్తాను అంటున్నాడు వంశీ. మరి..బాలీవుడ్ ఊపిరి కి కూడా డైరెక్టర్ వంశీ అవుతాడేమో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com