Home »
Cinema News »
ఏ హీరో ఇలాంటి సినిమా చేయడానికి ఒప్పుకోడు..ఊపిరి ఒక్క నాగార్జునకే సాధ్యం - దర్శకరత్న దాసరి
ఏ హీరో ఇలాంటి సినిమా చేయడానికి ఒప్పుకోడు..ఊపిరి ఒక్క నాగార్జునకే సాధ్యం - దర్శకరత్న దాసరి
Wednesday, April 13, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి...ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఊపిరి సినిమా రిలీజైన మూడవ వారంలో కూడా రికార్డు స్ధాయి కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతుండడం విశేషం. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఊపిరి $1.539 డాలర్లు వసూలు చేసి నాగార్జున కెరీర్ లో ఆల్ టైమ్ హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచి సరికొత్త రికార్డు సాధించింది. ఊపిరి చిత్రానికి ఇంతటి సంచలన విజయాన్ని అందించిన ప్రేక్షకాభిమానులకు థ్యాంక్స్ తెలియచేసుందకు ఊపిరి థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసారు. హైదరాబాద్ శిల్ప కళావేదికలో అక్కినేని వంశాభిమానుల సమక్షంలో ఊపిరి థ్యాంక్స్ మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
సుశాంత్ మాట్లాడుతూ...నిజంగా ఇన్ టచ్ బుల్ మూవీ కావాలనే చూడలేదు. ఫస్డ్ డే ఊపిరి సినిమా చూశాను. పెంటాసక్టిక్ మూవీ. ఇలాంటి సినిమా చేయాలంటే గట్స్ కావాలి. సినిమా చూస్తున్నప్పుడు కళ్లంట నీళ్లు వచ్చాయి. ఎమోషన్ తో ఏడుపు వచ్చేస్తుంది అనుకునే లోపు వెంటనే నవ్వించే సీన్ వచ్చేది. గీతాంజలి, తర్వాత శివ, నిన్నేపెళ్లాడతా తర్వాత అన్నమయ్య, సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత ఊపిరి ఇలా డిఫరెంట్ మూవీస్ చేస్తారని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు. కొంత మంది డిఫరెంట్ మూవీస్ చేయాలనుకుంటారు కానీ చేయలేరు. కానీ చినమామ (నాగార్జున) అనుకుంటే చేసేస్తారు అంతే. అందర్నీ సర్ ఫ్రైజ్ చేస్తూ ఊపిరి తర్వాత హతిరామ్ బాబా జీవిత చరిత్ర పై సినిమా చేస్తున్నారు. చినమామ లా డిఫరెంట్ సినిమాలు చేసే వెర్సటైల్ ఏక్టర్ ఇండియాలో మరోకరు లేరు అని నా అభిప్రాయం. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే సినిమాని ఇలా కూడా తీయగలను అని వంశీ తీసి చూపించాడు. పి.వి.పి గారు ఎంత నమ్మి ఈ సినిమాని తీసారో తెరపై కనిపిస్తుంది. ఏది అవసరమో అదే తీసారు. కంగ్రాట్స్ టు ఊపిరి టీమ్ అన్నారు.
గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ... ఊపిరి సినిమాకి పాటలు రాయం అనేది కొత్త అనుభూతి. ఇలాంటి సినిమా చేయాలంటే తన మీద తనకి నమ్మకం కావాలి. అలాంటి నమ్మకం పుష్కలంగా ఉన్న వ్యక్తి నాగార్జున గారు. నాగేశ్వరరావు గార్ని అనుసరించి నాగార్జున కొత్తదనంతో సినిమాలు చేస్తున్నారు. కొత్తదనాన్ని సున్నితనాన్ని నమ్మి సినిమాలు చేస్తే ఆదరిస్తారని ఊపిరి నిరూపించింది. ఈ సినిమా చేయడం మన అదృష్టం. ఈ సినిమా మాతృక చూసాను. సాధారణంగా రీమేక్ అంటే ఫ్రీమేక్ చేసేస్తారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీస్తారు. కానీ...ఇందులో భావావేశాలు భాషకి మానవీయ అనుబంధాలకు మలచడంలో నిజమైన కథని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ బృందానికి ధన్యవాదాలు. ఈ సినిమా అచ్చమైన తెలుగు కథగా ఉంది. అంతే కాదు హృదయాలను రంజింప చేసేలా ఉంది. కార్తీ తమన్నా ఈ చిత్రంలో పాత్రకు తగ్గట్టు నటించారు. అయితే వాళ్లని మించి కేవలం ముఖాన్ని మాత్రమే వినియోగిస్తూ అద్భుతంగా నటించిన నాగార్జున గార్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే వికలాంగుడి చిత్రం చూస్తున్నాం అనే భావాన్ని రాకుండా అత్యంత అద్భుత చిత్రాన్ని తీసినందుకు నిర్మాత పివిపిని కూడా అభినందిస్తున్నాను. మనం తీయాలే కానీ...శంకరాభరణం, అన్నమయ్య, శ్రీ రామదాసు..ఇలా మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా చూసిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా బాగోలేదు అనే మాట నేను వినలేదు అంటే ఎంత ఇష్టంగా ఈ చిత్రాన్ని చూసారో తెలుగు ప్రేక్షకులు అర్ధం చేసుకోవచ్చు. ఒక శిల్పి లా ఈ చిత్రాన్ని చెక్కాడు వంశీ.
ప్రతి పాటను సినిమాని ముందుకు నడపడానికే ఉపయోగించుకున్నాడు. ఐటం సాంగ్ కూడా కథలో భాగం. ఈ పాటలో అక్కడ డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూడలేదు. నాగార్జునని చూసాం. కార్తీ తుంటరితనాన్ని చూసాం. ప్రతి సున్నితమైన అంశంలో అబ్బూరి రవి అద్భుతమైన సంభాషణలు అందించాడు. ఈ సినిమాలో ఉన్న పాటలు.... పాటలు కావు. సినిమాలో వచ్చే సీన్స్ లాంటివి. మూడు నెలల పాటు పాటలు రాస్తూనే ఉన్నాను. ప్రతి రోజు నాతో కూర్చొని పాటలు బాగా రావడానికి సహకరించిన అబ్బూరి రవికి థ్యాంక్స్. ఊపిరి అనే గొప్ప సినిమాలో పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత పి.వి.పి గార్కి, డైరెక్టర్ వంశీకి థ్యాంక్స్ అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ...ఊపిరి సినిమా చూసిన తర్వాత నన్ను కొన్నిరోజులు విక్రమాదిత్య క్యారెక్టర్ వెంటాడుతూనే ఉంది. ఆయన కదలేకపోయినా మనల్ని కదిలించారు. సినిమాకి ఆ క్యారెక్టరే ఊపిరి. తీసేవాళ్లకు నచ్చాలి అని మనసులో పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో నటించిన ప్రతి క్యారెక్టర్ ని మనతోపాటు ఇంటికి తీసుకెళ్తాం. ఈ సినిమాతో మాకు కనువిప్పు కలిగేలా చేసారు అన్నారు.
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ...ఇలాంటి సినిమాని ఇచ్చినందుకు నాగ్ సార్ కి, కార్తీ, వంశీ కి ధ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఏ సినిమా చూసినా ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ సినిమాని ఎక్స్ పీరియన్స్ చేసాం. ఇది గొప్ప సినిమా. గత 25 సంవత్సరాలుగా డైరెక్టర్స్ ని మార్చిన సినిమాలు తీసుకుంటే అందులో నాగ్ సార్ సినిమాలే ఎక్కువు ఉంటాయి. నాగార్జున గారు తెలుగు హీరో అయినందుకు తెలుగు వారందరూ గర్వపడాలి. పెద్ద రిస్క్ చేసి ఈ సినిమా తీసారు అందుకే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. ప్రయత్నం బలంగా ఉంటే ఫలితం తృప్తిగా ఉంటుంది అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ...నాగార్జున గారు హ్యాట్రిక్ సినిమా ఇచ్చేసారు. ఒక్క సినిమా సక్సెస్ అవ్వడమే కష్టం అవుతున్న ఈరోజుల్లో హ్యాట్రిక్ ఇచ్చారు. ఇండస్ట్రీ తరుపున నాగార్జున గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. కొత్త కొత్త సినిమాలు రావడానికి ఏం చేయాలో నాగార్జున గారు సీనియర్ హీరోలకి, జూనీయర్ హీరోలకు, నెక్ట్స్ జనరేషన్ హీరోలకి చూపించారు. వంశీ కూడా హ్యాట్రిక్ కొట్టేసాడు. కార్తీ కూడా తమిళ్ సినిమాలతో హ్యాట్రిక్ సాధించాడు. పి.వి.పి గారు కూడా నెక్ట్స్ మూవీతో హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ... ఇది రాయి. నాకు ఇది కావాలి.. ఇదే కావాలని మాతో రాయించిన వంశీకి థ్యాంక్స్. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీరు ఇలా ఆదరిస్తే ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు వస్తూనే ఉంటాయి.నాగార్జున గారు మీరే మా ఊపిరి అన్నారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ...నేను చాలా గొప్ప సినిమాలు చూసాను. ఈ జనరేషన్ లో ఇంత గొప్ప సినిమా చూసినందుకు హ్యాఫీగా ఫీలవుతున్నాను అన్నారు.
నిర్మాత నాగ సుశీల మాట్లాడుతూ...ఊపిరి సినిమాని విజయవాడలో చూసాను. సినిమా చూస్తూ ఎంత ఏడ్చానో అంత సంతృప్తిగా బయటకు వచ్చాను. మన ఇంట్లో విక్రమాదిత్య లాంటి వాళ్లు ఉంటే సింపతి చూపించకుండా నవ్విస్తూ ఉండాలి. నా భర్త వీల్ ఛైర్ లో ఉన్నారు. కానీ నేనెప్పుడూ సింపతి చూపించలేదు. ఈ విషయాన్ని మనందరం నేర్చుకోవాలి. అద్భుతమైన చిత్రాన్ని అందించిన వంశీ గారు హ్యాట్సాఫ్. మా నాన్నకు నచ్చే సినిమా ఇది. నాగార్జున, కార్తీ పోషించిన పాత్రల్లో వేరే ఎవర్నీ ఊహించుకోలేం. మా ఫ్యామిలీని ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. త్వరలో చైతన్య, సుమంత్, సుశాంత్, అఖిల్ చిత్రాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు
హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ... ఇప్పటి వరకు కొన్ని మంచి సినిమాలు చేసాను. కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ ఎంజాయ్ చేయలేదు. మంచి సినిమాలో నటించిన తర్వాత ఆ సక్సెస్ ని ఆడియోన్స్ తో కలసి ఎంజాయ్ చేయడం బాగుంది. ఊపిరి అనే గొప్ప సినిమాలో నటించడంతో ఈ టీమ్ నాకు చాలా స్పెషల్. కార్తీతో కలిసి నటించిన మూడవ సినిమా ఇది. ఈ మూడు సినిమాలు సక్సెస్ అయినందుకు కార్తీ నా లక్కీ హీరో అనుకుంటున్నాను. నాగ్ సార్ స్వీటెస్ట్ పర్సన్ . నాగ్ సార్ తో వర్క్ చేసే అవకాశం రావడం నా అదృష్టం అన్నారు.
హీరో అఖిల్ మాట్లాడుతూ... మా నాన్నకు ఇంత మంచి స్ర్కిప్ట్ ఇచ్చినందుకు వంశీ కి ధ్యాంక్స్ తెలియచేస్తున్నాను. మా నాన్నను వీల్ చైర్ లో చూసి హ్యాపీగా ఫీలయ్యాను. అంటే సినిమా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ కావాలి. తమన్నా, కార్తీ..ఇలా ఇంత పెద్ద కాస్టింగ్ తో సినిమా తీసిన పి.వి.పి ని అభినందిస్తున్నాను. నేను ఏడవను కానీ ఈ సినిమా చూసి ఏడ్చేసాను. అన్నయ్య షూటింగ్ లో విదేశాల్లో ఉండడం వలన రావడం కుదరలేదు. అన్నయ్య వచ్చి ఉంటే ఇద్దరం కలిసి నాన్నా మీరే మా ఊపిరి అని చెప్పేవాళ్లం. ఎ.ఎన్.ఆర్ లీవ్స్ ఆన్ అన్నారు.
డైరక్టర్ వంశీ మాట్లాడుతూ...దాసరి గారి సినిమాలు చూసి పెరిగాను. ఈరోజు దాసరి గారు ఊపిరి ఫంక్షన్ కు రావడం చాలా సంతోషంగా ఉంది. దాసరి గారు ఫోన్ చేసి ఊపిరి సినిమా గురించి మాట్లాడిన మాటలు ఎప్పటికీ మరచిపోలేను. నా మీద పెట్టుకున్న ఎంతో మంది కష్టం నన్ను ఇక్కడకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరకీ థ్యాంక్స్. ఊపిరి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా స్పెషల్ గా కనిపిస్తున్నారు. నామీద నమ్మకంతో నాతో మూడు సినిమాలు నిర్మించిన నిర్మాత దిల్ రాజు గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.నా ఫస్ట్ ససినిమా హీరో ప్రభాస్ , బృందావనం హీరో ఎన్టీఆర్, ఎవడు సినిమా అవకాశం ఇచ్చిన చిరంజీవి గార్కి,చరణ్, బన్నికి థ్యాంక్స్ . వీళ్లందరికీ ఎంత చెప్పినా తక్కువే. వీళ్లందరూ ఒక ఎత్తైతే నాగార్జున గారు మరో ఎత్తు. నాగార్జున గార్కి పాదాభివందనం చేస్తున్నాను. నాగార్జున గార్ని కలసిన ఫస్డ్ డే నాలో ఉన్న భయాన్ని నమ్మకంగా మార్చి పంపించారు. నాగార్జున గారు ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కరికి జీవితం ఇచ్చారు. వీల్ ఛైర్ లో నాగార్జున గార్ని ఎలా కూర్చోబెడతారు అని చాలా మంది అడిగారు. కానీ నాగ్ సార్ మమ్మల్ని ముందుకు నడిపించారు. కార్తీకి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కేవే. ఊపిరి సినిమాకి నాగార్జున గారు ఓ ఊపిరి అయితే ఇంకో ఊపిరి పివి అన్న. కంటెంట్ నమ్మి అవకాశాన్ని ఇచ్చిన మీకు పాదాభివందనాలు. రచయిత హరి లేకపోతే ఏ అడుగు వేయలేను. హరిని నేను అన్నయ్యగా భావిస్తాను . హరి నా లైఫ్ లోకి వచ్చారు జీవితం బ్యూటీఫుల్ గా మారింది. మంచి సినిమా తీస్తే ఇంతగా అభినందిస్తారా అని తెలిసింది అన్నారు.
నిర్మాత పివిపి మాట్లాడుతూ...సినిమాకి ఊపిరి ప్రేక్షకులు. ఒక మిషన్ గా వర్క్ చేసాం. మీ సపోర్ట్ ఇలాగే కావాలి అన్నారు.
దర్శకరత్న దాసరి మాట్లాడుతూ...అక్కినేని అభిమానులు అంటే నా అభిమానులు. నా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు సినిమా పరిశ్రమకి అక్కినేని ఊపిరి. నాగేశ్వరరావు గార్కి నాగార్జున ఊపిరి. నాగార్జునకి చైతు అఖిల్ ఊపిరి. నేను పదిహేను సంవత్సరాల క్రితం బొమ్మరిల్లు సినిమా చూసాను. ఆతర్వాత నేను ఇంత వరకు ఒక గొప్ప సినిమాని చూసుంటే అది కేవలం ఊపిరి. నేను ఎవరి మెప్పుకోసమో మాట్లాడావలసిన అవసరం నాకు లేదు. తెలుగు వాళ్లు మంచి సినిమాలు చేయడం లేదు. మనం హిందీ, మలయాళ చిత్రాలతో పోటీపడి మంచి సినిమాలు చేయడం లేదు అని బాధపడేవాడిని. అలా బాధ పడుతున్న టైంలో నిజంగా ఆ బాధ మరిచిపోయేలా తెలుగువాడు కూడా గొప్ప సినిమా తీయగలడు అని నిరూపించింది ఊపిరి సినిమా.
గట్స్ తో ఊపిరి సినిమా తీసిన పి.వి.పి ని మనసారా అభినందిస్తున్నాను. ఇదే నాగార్జున, కార్తీ, తమన్నా లతో కమర్షియల్ సినిమా తీయచ్చు. కానీ ఓ మంచి సినిమా తీయాలని ఈ సినిమా తీసారు. నాగార్జున కి హ్యాట్సాఫ్. నాకు తెలిసి ఓ కమర్షియల్ హీరో ఇలాంటి సినిమా చేయడానికి ఒప్పుకోడు. కళ్లతో రెండున్నర గంటల సేపు నటించడం అంటే సామాన్యం కాదు. నాగార్జున కళ్లు నాకు చాలా ఇష్టం. మజ్ను క్లైమాక్స్ లో నాగార్జున కళ్ల పై ఓ సీన్ తీసాను. నాగార్జున కళ్లును ఎవరు వాడుకోలేదు. వంశీ బాగా వాడుకున్నాడు మొత్తం సినిమా అంతా వాడుకున్నాడు. కళ్లతో నటించడం అంటే నటనలో పరిణితి వచ్చిన వాళ్లే చేయగలరు. నేను కనుక అవార్డు కమిటీలో ఉంటే నాగార్జునకి బెస్ట్ ఏక్టర్ అవార్డ్ ఇచ్చేస్తాను. మనం సినిమాని అన్నపూర్ణ సంస్థ తప్ప వేరే వాళ్లు తీసేవారు కాదు. ఒకవేళ తీసినా ఆడేది కాదు. అలాగే అన్నమయ్య సినిమా చేయడానికి మిగిలిన హీరోలు ఒప్పకోరు. నాగేశ్వరరావు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అదే స్పూర్తి నాగార్జునలో కనిపిస్తుంది. ఈ సినిమాకి నిజమైన హీరో దర్శకుడు. ప్రతి సీన్ ప్రతి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కార్తీ తప్ప ఎవరు చేసినా ఆ పాత్ర అంత ఇన్నోషెంట్ గా ఉండేది కాదు. 15 ఏళ్లలో నేను చూసిన గొప్ప సినిమా ఊపిరి. ఈ సినిమా యూనిట్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ...ఊపిరి ఆడియో ఫంక్షన్ లో నాగ చైతన్య సినిమా టైటిల్ సాహసం శ్వాసగా సాగిపో టైటిల్ నాకు బాగా ఇష్టం అని చెప్పాను. అలా సాహసంతో చేస్తేనే గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, మన్మధుడు ...ఇలా ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేసాను. సాహసం నేనయితే శ్వాస మీరు ( అభిమానులు). అభిమానుల అండ లేకపోతే నేను ఇలాంటి సినిమాలు చేయగలిగే వాడినే కాదు. ఎప్పటి నుంచో నన్ను ఎంతగానో అభిమానిస్తున్న అందరికీ పాదాభివందనాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో తెలియదు. ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేస్తూ మిమ్మిల్ని ఆనందింప చేస్తాను.
సోగ్గాడే చిన్న నాయనా చూసి బంగార్రాజు అన్నారు. ఊపిరి చూసి చమర్చిన కళ్లతో విక్రమాదిత్య అంటున్నారు ఇంత కన్నా నటుడికి ఏం కావాలి. ఇదే సాహసంతో తిరుపతిలో హతిరామ్ బాబా మీద కొత్త సినిమా చేస్తున్నాను. అంతే కాకుండా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య సినిమా ప్రారంభించాలి. అఖిల్, వంశీ కలిసి చేసే సినిమా కథ ఫైనల్ చేయాలి. ఈ రెండు నెలల్లో నేను చేసే పని ఇది. చైతన్య, అఖిల్ సినిమాల విషయంలో ఇంతకు ముందు మనసు పెట్టలేదు. ఈ సంవత్సరం అదే పనిలో ఉంటాను. ఒక ఏక్టర్ కి డైరెక్టర్ కి కావాల్సింది గొప్ప ప్రొడ్యూసర్. అలాంటి గొప్ప ప్రొడ్యూసర్ పివిపి నాకు దొరకడం హ్యాఫీగా ఉంది. నా తమ్ముడు కార్తీ వలన ఈ సినిమా ఇంత చక్కగా వచ్చింది. ఊపిరి సినిమాని ఆదరించి గొప్ప విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
- logoutLogout
Login to post comment