నటి కల్పన మృతికి సంతాపం తెలిపిన 'ఊపిరి' యూనిట్
Send us your feedback to audioarticles@vaarta.com
నటి ఊర్వశి సోదరి కల్పన(51) ఈరోజు(25) తెల్లవారు ఝామున గుండెపోటుతో మరణించారు. తమిళ, మలయాళ భాషల్లో కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న కల్పన ప్రస్తుతం నాగార్జున, కార్తీ హీరోలుగా పివిపి సినిమా పతాకంపై పివిపి నిర్మిస్తున్న 'ఊపిరి' చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కల్పనకు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ ఆదివారం(24)తో ముగిసింది. సోమవారం కొంత ప్యాచ్‌వర్క్ చెయ్యాల్సి వుంది. ఈ చిత్రం షూటింగ్‌తోపాటు ఈరోజు జరగనున్న ఓ అవార్డ్ ఫంక్షన్లో కూడా ఆమె పాల్గొనాల్సి వుంది. నిన్న షూటింగ్ ముగించుకొని వెళ్ళిన కల్పన రాత్రి నిద్రలోనే తుదిశ్యాస విడిచారు. ఇప్పటివరకు 300కి పైగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి అందరినీ అలరించిన కల్పన తన చివరి ఊపిరి వరకు నటించి కన్నుమూశారు.
1980లో నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన కల్పన 2012లో 'ఎన్‌జాన్ తనిచెల్ల' అనే మలయాళ చిత్రంలో నటించినందుకుగాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డును అందుకున్నారు. కమల్‌హాసన్‌తో 'సతీ లీలావతి', 'బ్రహ్మచారి' చిత్రాల్లో నటించిన కల్పన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.
కల్పన ఆకస్మిక మృతి పట్ల 'ఊపిరి' యూనిట్ తమ సంతాపాన్ని తెలియజేసింది. కల్పన మరణవార్త తెలుసుకున్న హీరో కార్తీ హాస్పిటల్‌కి వెళ్ళి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అక్కినేని నాగార్జున, వంశీ పైడిపల్లి, పివిపిలతోపాటు యూనిట్ సభ్యులంతా హాస్పిటల్‌కి వెళ్ళి ఆమె భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
'ఊపిరి' నిర్మాత పివిపి మాట్లాడుతూ - ''కల్పన చాలా మంచి నటి. మా 'ఊపిరి' చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఆదివారంతో ఆమెకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆమె చివరి ఊపిరి వరకు నటిస్తూనే వున్న కల్పన ఆకస్మికంగా మృతి చెందడం మా యూనిట్ సభ్యుల్ని కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com