ఊపిరి ఈరేంజ్ సక్సెస్ కి కారణం అదే - అక్కినేని నాగార్జున

  • IndiaGlitz, [Sunday,March 27 2016]
నాగార్జున - కార్తీ - త‌మ‌న్నాక‌ల‌సి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో పి.వి.పి నిర్మించిన ఊపిరి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. క్లాస్ - మాస్ - ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా ఆల్ ఆడియోన్స్ ని ఆక‌ట్టుకుంటుంది ఊపిరి. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఊపిరి స‌క్సెస్ మీట్ లో
నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ...ఊపిరి సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి తెలుగు సినిమా గురించి చెప్పాలంటే...ఊపిరి ముందు ఊపిరి త‌ర్వాత అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. త్వ‌ర‌లో ఊపిరి విజ‌యేత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నాం. ఊపిరి అనేది రెండు సంవ‌త్స‌రాల జ‌ర్నీ. ఇలాంటి సినిమా ఈరేంజ్ స‌క్సెస్ సాధించ‌డం అనేది తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఓ సెన్సేష‌న్. త‌మిళ‌నాడులో బాల‌చంద‌ర్ తీసిన సినిమాలా ఉంది అంటున్నారు. బ్లాక్ బ‌ష్ట‌ర్ మూవీస్ ఎన్నో వ‌స్తుంటాయి కానీ...ఓ మంచి చిత్రం తీసినందుకు గ‌ర్వంగా ఉంది. ఈ సినిమా ఇంత స‌క్సెస్ సాధించిదంటే ఆ క్రెడిట్ నాగార్జున - కార్తీ - వంశీ కి చెందుతుంది అన్నారు.
డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ...ఓ మంచి సినిమా తీసాన‌ని ఊపిరి నాకు రెస్పెక్ట్ ని తీసుకువ‌చ్చింది. నాగార్జున గారు షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే స‌రిగ్గా తీస్తే ఊపిరి ఓ క్లాసిక్ అవుతుంద‌ని చెప్పారు. నాగార్జున గారు చెప్పిన‌ట్టే ఊపిరి క్లాసిక్ గా నిలుస్తుంద‌న్నందుకు ఆనందంగా ఉంది. నాగార్జున గారు నిజ‌మైన ట్రెండ్ సెట్ట‌ర్. త‌మిళ‌నాడులో నేను తీసిన ఊపిరి చిత్రాన్ని బాల‌చందర్ గారి సినిమాతో పొల్చ‌డం అంటే అంత‌కు మించిన అభినంద‌న ఏముంటుంది. న‌న్ను అభినందించిన ద‌ర్శ‌కులంద‌రికీ ధ్యాంక్స్ అన్నారు.
హీరో కార్తీ మాట్లాడుతూ...నాగార్జున గారు చెబుతున్న‌ట్టుగా...ఊపిరి నాకు లైఫ్ ఛేంజింగ్ ఫిల్మ్. 1980 టైంలో ఈత‌ర‌హా చిత్రాలు వ‌చ్చేవి. మ‌న లైఫ్ లో ఎన్నో క‌థ‌లు ఉన్నాయి కానీ ఎవ‌రు తీయ‌డం లేదు. ప్రేక్ష‌కులు ఈ సినిమాని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ సార్ వీల్ ఛైర్ లో కూర్చొని క‌ళ్ల‌తోనే అద్భుతంగా న‌టించేసారు. బాహుబ‌లి త‌ర్వాత మ‌రో ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ ఊపిరి. ఇలాంటి మంచి సినిమాలో న‌టించినందుకు గ‌ర్వంగా ఉంది అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ...నిన్న క్ష‌ణం - నేడు ఊపిరి చిత్రాల‌తో పి.వి.పి సంస్థ తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. నిర్మాత న‌మ్మ‌కంగా తీస్తేనే ఇలాంటి సినిమాలు వ‌స్తాయి. పి.వి.పి ఇలాంటి విభిన్న క‌థా చిత్రాలు మ‌రిన్ని తీయాల‌ని కోరుకుంటున్నాను. ఊపిరి టైటిల్స్ లో ఎ ఫిల్మ్ బై వంశీ పైడిప‌ల్లి అని కాకుండా ఎ ఫిల్మ్ బై వంశీ పైడిప‌ల్లి టీమ్ అని వేయ‌డం బాగుంది. త‌న టీమ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వంశీని అభినందిస్తున్నాను. అబ్బూరి ర‌వి అద్భుత‌మైన డైలాగ్స్ రాసాడు. హ‌రి, సాల్మ‌న్, పి.ఎస్.వినోద్...వీళ్లంతా సినిమాని ప్రేమించి ఎంతో ఇష్టంగా వ‌ర్క్ చేసారు. అందుకే ఈరేంజ్ స‌క్సెస్ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల ఊపిరి సినిమాతో మాలో స్పూర్తి క‌లిగించార‌ని మెసేజ్ పంపించాడు. అలాగే వినాయ‌క్ గారు మంచి సినిమా అంటూ మెసేజ్ పంపించారు. మ‌హేష్ అయితే ఏకంగా ఇర‌వై నిమిషాలు మాట్లాడాడు. అన్నిర‌కాల పాత్ర‌లు నువ్వే చేసేస్తే మేం ఏం చేయాల‌న్నాడు (న‌వ్వుతూ..) రాఘ‌వేంద్ర‌రావుగారు కూడా ఫోన్ చేసి సినిమా గురించి చాలా సేపు మాట్లాడారు. చైత‌న్య‌, అఖిల్, అమ‌ల ఫ్రెండ్స్...ఇలా చాలా మంది మంచి సినిమా..చాలా బాగుంది అంటూ మెసేజ్ లు పంపుతున్నారు. తెలుగులోనే కాకుండా త‌మిళ్ లో కూడా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తుండ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

More News

అఖిల్ సెకండ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్స్..

అక్కినేని అఖిల్ రెండో సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది.ఊపిరి సినిమా రిలీజ్ తర్వాత అఖిల్ నెక్ట్స్ మూవీ గురించి ఎనౌన్స్ చేస్తానని నాగ్ గతంలో చెప్పారు.

పవర్ స్టార్ ని ప్రేమిస్తున్న హీరోయిన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు...

హీరో ఉద‌య్ కిర‌ణ్ అరెస్ట్..

హీరో ఉద‌య్ కిర‌ణ్ అరెస్ట్ అన‌గానే ఉద‌య్ కిర‌ణ్ చ‌నిపోయాడు క‌దా...ఇదేదో త‌ప్పుగా రాసారు అనుకుంటే పొర‌పాటే. విష‌యం ఏమిటంటే..ఫేస్ బుక్ సినిమాలో న‌టించిన హీరో పేరు కూడా ఉద‌య్ కిర‌ణే.

సరైనోడు ప్లానింగ్ ఏంటంటే..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం సరైనోడు. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర  కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

క‌మ్మ కులం గొప్పేమిట‌ని ప్ర‌శ్నిస్తున్న జ‌గ‌ప‌తి..

సింహ స్వ‌ప్నం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..ఎన్నోవిభిన్నపాత్ర‌లు పోషించి మెప్పించిన ఫ్యామిలీ చిత్రాల క‌థానాయ‌కుడు జ‌గ‌ప‌తి బాబు. క‌థానాయ‌కుడు నుంచి లెజెండ్ సినిమాతో ప్ర‌తినాయ‌కుడుగా మారి హీరోగానే కాకుండా విల‌న్ గా కూడా మెప్పించ‌గ‌ల‌న‌ని నిరూపించారు.