ఊపిరి చూసి అరెస్టైన విద్యార్ధులు..

  • IndiaGlitz, [Monday,April 04 2016]

ఊపిరి సినిమా చూసి విద్యార్ధులు అరెస్ట్ అవ్వ‌డం ఏమిటి అనుకుంటున్నారా..? ఇది నిజం. అయితే... పైర‌సీ సినిమా చూడ‌డం వ‌ల‌న అరెస్ట్ చేసార‌నుకుంటే పొర‌పాటే. పైర‌సీ కాదు...థియేట‌ర్లో సినిమా చూస్తుంటేనే అరెస్ట్ చేసార‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...టిక్కెట్ కొన‌కుండా ద‌ర్జాగా ధియేట‌ర్లో ఊపిరి సినిమా చూస్తున్నార‌ట‌.
ఈ విష‌యం తెలుసుకుని థియేట‌ర్ యాజ‌మాన్యం పోలీసుల‌కు స‌మాచారం అందించార‌ట‌. వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగి టిక్కెట్ కొన‌కుండా ఊపిరి సినిమా చూస్తున్న విద్యార్ధుల‌ను అరెస్ట్ చేసార‌ట‌. ఈ సంఘ‌ట‌న జ‌రిగింది అమెరికాలో కావ‌డం విశేషం. విద్యార్ధుల‌ను స్టేష‌న్ కి తీసుకెళ్లి జ‌రిమానా వేసి..వార్నింగ్ ఇచ్చి వ‌దిలేసార‌ట‌. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసారా లేదా అనేది తెలియ‌లేదు. టిక్కెట్ కొన‌కుండా తెలుగు విద్యార్ధులు సినిమా చూసిన విష‌యం వారు చ‌దివే యూనివ‌ర్శిటీలో తెలిసి పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ట‌. అదీ సంగ‌తి.

More News

విశాల్ కు విలన్ అవుతున్న జగ్గుబాయ్...

హీరోగా ఉన్న జగపతి బాబు అలియాస్ జగ్గుబాయ్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా రాణిస్తూ బిజీగా ఉన్నాడు.

ఒకేరోజు తెలుగు-తమిళ్ లో 24 ఆడియో రిలీజ్..

సూర్య నటిస్తూ...నిర్మిస్తున్న చిత్రం 24.ఈ చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్ లో ఉల‌వ‌చారు బిర్యానీ..

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టించి..తెర‌కెక్కించిన విభిన్న క‌ధాచిత్రం ఉల‌వ‌చారు బిర్యానీ. ఈ చిత్రం తెలుగు కంటే ముందు మ‌ల‌యాళంలో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ టైటిల్ తో రూపొందింది. ఆత‌ర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లో రీమేక్ చేసారు.

'అప్పుడలా ఇప్పుడిలా' కి విజయాన్నిఅందిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు....ప్రదీప్ కుమార్ జంపా

సూర్యతేజ,హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు.

నాని 'ఎవరితడు'..?

నేచురల్ స్టార్ నాని హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా తర్వాత నా చేస్తున్న సినిమా ఇది. ఇందులో నాని డబుల్ రోల్ చేస్తున్నాడు.