తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అలాంటి సినిమా ఊపిరి - నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మల్టీస్టారర్ ఊపిరి. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈనెల 25న ఊపిరి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...నిన్ననాగార్జున గారు ఊపిరి సినిమా చూసారు. థియేటర్ నుంచి బయటకు రాగానే నన్ను హగ్ చేసుకుని బాగా తీసావంటూ అభినందించారు. నాగార్జున గారు, కార్తీ, పి.వి.పి వాళ్ల నమ్మకం ఈ సినిమా. 25న రిలీజ్ కానున్న ఊపిరి గురించి ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాం అంటే ఈ సినిమా పై మాకు ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. పి.వి.పి గారు మనసుపెట్టి ఈ సినిమాని నిర్మించారు. నాకు తెలిసి మాస్ సినిమా క్లాస్ సినిమా అని లేవు. నాకు తెలిసిందల్లా ఒకటే మంచి సినిమా చెడ్డ సినిమా. ఈ సినిమాలో నాగార్జన గారికి ప్లాష్ బ్యాక్ పెట్టాలనుకున్నాను. కానీ నాగ్ సారే...నాకోసమని ప్లాష్ బ్యాక్స్ లాంటివి ఏమీ పెట్టద్దు అని చెప్పారు. ఆయన ఇచ్చిన ఇన్ స్పిరేషన్ తోనే ఓ కొత్త సినిమా తీసాను. ఊపిరి నా కెరీర్లో మరో మలుపు అవుతుంది. కార్తీ - నేను అనుకుని ఊపిరి అనే టైటిల్ పెట్టాం. దిల్ రాజు - పి.వి.పి నా సినిమాలకు నిర్మాతలు కావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ...ఊపిరి సినిమా రెండు సంవత్సరాల జర్నీ. ఊపిరి సినిమాని నిర్మించినందుకు గర్వంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న 2,000 థియేటర్స్ లో ఊపిరి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. యు.ఎస్ లో 90 మెయిన్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. తెలుగులో కార్తీకి ఈ సినిమా ఫస్ట్ సినిమా కావడం, అలాగే తమన్నా ఫస్ట్ టైం తెలుగులో డబ్బింగ్ చెప్పడం, నాగార్జున గారు తమిళ్ లో ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పడం..ఇలా ఎంతో ప్రత్యేకత కలిగిన చిత్రం ఊపిరి. హాలీవుడ్ లో తీసినట్టుగా ఆ స్టాండర్డ్స్ తో తెలుగులో మనం ఎందుకు సినిమా తీయలేం అనే పట్టుదలతో ఈ సినిమాని తీసాం. ఊపిరి సక్సెస్ క్రెడిట్ అంటే ఏ ఒక్కరికో కాకుండా టీమ్ అందరికీ చెందుతుంది అన్నారు.
హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ...కార్తీ తెలుగులో మాట్లాడుతుంటే హ్యాపీగా ఫీలవుతున్నాను. నాగార్జున గారు - కార్తీ లేకపోతే ఈ సినిమా లేదు. వీళ్లిద్దరూ లేని ఊపిరి సినిమాని అసలు ఊహించలేం. నాగ్ సార్ - కార్తీ పాత్రల్లో నటించలేదు..జీవించారు. వంశీ మనసులో ఏం ఉందో అది తెరపైకి తీసుకువచ్చారు. ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ ఎంజాయ్ చేస్తూ చేసాను. ఊపిరి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమాని తెలుగు వారు చూసి గర్వపడతారు అన్నారు.
హీరో కార్తీ మాట్లాడుతూ...తెలుగులో నా ఫస్ట్ స్ట్రైయిట్ ఫిలిమ్ ఊపిరి. ఈ సినిమా అంతా ఒక డ్రీమ్ లా జరిగింది. సినిమాలో నటించినప్పుడు డబ్బులు వస్తుంటాయి...పోతుంటాయి. కానీ ఏదో ఒక సినిమా మాత్రమే మనకు రెస్పెక్ట్ తీసుకువస్తుంది. అలాంటి సినిమా ఇది. ఈ సినిమా నాకో కొత్త ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది. నాగ్ సార్ ఒక మెచ్యూర్ క్యారెక్టర్ పోషించారు. ఈ సినిమాలో నాగార్జున గారు బిలియనీర్ గా నటించారు. నిజంగా అలాగే ఉంటారు. ఈ సినిమా చేయడంతో నాగ్ సార్ తో ఒక రిలేషన్ షిప్ ఏర్పడింది. నాగార్జున గారు నటించిన గీతాంజలి, రక్షకన్ సినిమాలు చూసాను. చిన్నప్పటి నుంచి చూసిన హీరో నాగార్జున గారితో కలసి వర్క్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తమన్నా పాత్రకు తగ్గట్టుగా చాలా బాగా నటించింది. ఇది రీమేక్ కాదు. దాదాపు 50 కొత్త సీన్స్ తో తీసిన సినిమా ఇది. ఊపిరి బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ....తమిళనాడులో నన్ను ఎంతగానో రిసీవ్ చేసుకున్నారు. అక్కడ చెప్పిన మాట ఇక్కడ కూడా చెబుతున్నాను. ఫ్రెంచ్ ఫిల్మ్ అఫిషియల్ రీమేక్ ఇది. ఈ సినిమా ట్రూ స్టోరి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. వాళ్లు ఇప్పుడు బతికే ఉన్నారు. కొన్ని కథలు టచ్ చేస్తాయి. వాటిలో సోల్ ఉంటుంది. అటువంటి కథే ఊపిరి. ఐదు సంవత్సరాల క్రితం ఇంట్లో ఫ్రెంచ్ ఫిల్మ్ ఇన్ టచ్ బుల్స్ చూసాను. ఎవరైనా ఈరోల్ నాకు ఇస్తే బాగున్ను అనుకున్నాను. నా కోరిక దేవుడు విన్నాడేమో ఈ కథ నా దగ్గరకి వచ్చింది. ఈ కథలోకి అలాగే కార్తీ వచ్చాడు. హీరోయిన్ గా ఎవర్నో అనుకుంటే తమన్నా వచ్చింది. కథే మమ్మల్ని ఎంచుకుంది.ఈ సినిమా చేయడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. వంశీ తనను తాను మార్చుకుని ఈ సినిమా తీసాడు. తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అలాంటి సినిమా ఇది. ఒక నిర్మాతగా చెబుతున్నాను ఇలాంటి కథతో సినిమా తీయడం అంటే నిర్మాతకు కష్టం. పి.వి.పి ఎంతో ఇష్టంతో ఈ సినిమాని నిర్మించారు. కార్తీ పది సంవత్సరాల కెరీర్ లో పది సినిమాలు చేసాడు అంటే ఎంత సెలెక్టివ్ గా ఉన్నాడో తెలుస్తుంది. అలా సెలెక్టివ్ గా తెలుగులో స్ట్రైయిట్ ఫిల్మ్ చేయడానికి ఈ సినిమాని ఎంచుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఎలాంటిదో... కార్తీ తెలుగులో డైలాగ్స్ చెప్పే విధానం చూస్తుంటే నేను ఎందుకు తమిళ్ డైలాగ్స్ చెప్పలేకపోయానని సిగ్గుపడేవాడిని. నిన్ననే ఊపిరి సినిమా చూసాను. ఒక మంచి సినిమా చేసినందుకు తృప్తిగా..సంతోషంగా ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టు నా కెరీర్ లో లైఫ్ ఛేంజింగ్ ఫిల్మ్ ఊపిరి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout