యు.ఎస్ లో 1 మిలియన్ క్రాస్ చేసిన ఊపిరి
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున - కార్తీ కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఊపిరి. తెలుగు - తమిళ్ లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఊపిరి సినిమా రిలీజైన రోజు నుంచి అన్నిచోట్లా ఫీల్ గుడ్ మూవీ అంటూ పాజిటివ్ టాక్తో ప్రదర్శింపబడుతోంది. ముఖ్యంగా యు.ఎస్ లో ఊహించని విధంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. శుక్రవారం రిలీజైన ఊపిరి చిత్రం మంగళవారానికి 1 మిలియన్ మార్క్ దాటడం విశేషం.
గతంలో నాగార్జున నటించిన మనం చిత్రం 1 మిలియన్ మార్క్ దాటింది. ఆతర్వాత సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఇక్కడ బ్లాక్ బష్టర్ గా నిలిచినా యు.ఎస్ లో 1 మిలియన్ మార్క్ దాటలేకపోయింది. ఇప్పుడు ఊపిరి చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ ను దాటడం విశేషం. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విభిన్నపాత్రలు పోషించిన సీనియర్ హీరో నాగార్జున కేవలం ఐదు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ సాధించడం అంటే నేటితరం ప్రేక్షకుల్లో నాగార్జున కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments