ఊపిరి లో నాగ్ సార్ ని చూసి చాలా మంది న‌టులు స్పూర్తి పొందుతారు - త‌మ‌న్నా

  • IndiaGlitz, [Tuesday,March 15 2016]

టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్...లాంగ్వేజ్ ఏదైనా...క్యారెక్ట‌ర్ ఏదైనా స‌రే...పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టిస్తూ ఆడియోన్స్ లో క్రేజ్ ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. నాగార్జున - కార్తీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఊపిరిలో త‌మ‌న్నాన‌టించింది. తెలుగు, త‌మిళ్ లో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఊపిరి ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా మిల్కీబ్యూటీ త‌మ‌న్నా తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

ఊపిరి లో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

నా క్యారెక్ట‌ర్ పేరు కీర్తి. బిలియ‌నీర్ పి.ఎ కాబ‌ట్టి బాగా చ‌దువుకుని..బాధ్య‌త గ‌ల అమ్మాయిగా క‌నిపిస్తాను. అలాగే స్ట్రాంగ్ ఉమెన్ ఎలా ఉంటుందో అలా నా క్యారెక్ట‌ర్ ఉంటుంది.

మీరు చేసిన పాత్ర‌కు ముందుగా శృతిహాస‌న్ ని తీసుకున్నారు. ఆత‌ర్వాత శృతిహాస‌న్ ప్లేజ్ లో మిమ్మ‌ల్ని తీసుకున్నారు...?

నాకు ఆ విష‌యం తెలియ‌దు.

ఊపిరి ఓరిజిన‌ల్ కి రీమేక్ కి మార్పులు ఏమైనా చేసారా..?

ఇది రీమేక్ కాదండి. ది ఇన్ ట‌చ్ బుల్స్ సినిమా స్పూర్తితో తీసిన సినిమా ఇది. ఓరిజిన‌ల్ ఎలా ఉందో అలా తీస్తే ఇక్క‌డ ఎక్స‌ప్ట్ చేయ‌రు. అందుచేత ఇండియ‌న్ ఆడియోన్స్ కి త‌గ్గ‌ట్టు మార్పులు చేసారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి భాష అవ‌స‌రం లేదు.

ఊపిరి ఓరిజిన‌ల్ ది ఇన్ ట‌చ్ బుల్స్ సినిమాని చూసారా..?

నేను చూడ‌లేదండి..కాక‌పోతే నా క్యారెక్ట‌ర్ లో చాలా మార్పు క‌నిపిస్తుంది.

సినిమా చూడ‌లేద‌న్నారు క‌దా...మీ క్యారెక్ట‌ర్ లో చాలా మార్పు క‌నిపిస్తుంది అని ఎలా చెబుతున్నారు..?

నేను ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు ది ఇన్ ట‌చ్ బుల్స్ సినిమా చూడ‌లేదు. కాక‌పోతే ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ గురించి...ఇందులో చేసిన మార్పులు గురించి చాలా మంది చెప్పారు.

తెలుగు, త‌మిళ్ లో మీ క్యారెక్ట‌ర్ లో మార్పులు ఉంటాయా..?

నాగార్జున గారు, కార్తీ వీరిద్ద‌రి క్యారెక్ట‌ర్స్ లో మార్పులు ఉన్నాయా..లేదా అనేది నాకు తెలియ‌దు కానీ...నా క్యారెక్ట‌ర్ కి మాత్రం తెలుగు, త‌మిళ్ కి మార్పులు ఉన్నాయి. తెలుగు, త‌మిళ్ రెండు డిఫ‌రెంట్ లాంగ్వేజ‌స్ కాబ‌ట్టి మేన‌రిజ‌మ్స్, ఎక్స్ ప్రెష‌న్స్ వేరుగా ఉంటాయి. తెలుగు,త‌మిళ్ ట్రైల‌ర్ చూస్తేనే ఈ విష‌యం తెలుస్తుంది.

తెలుగులో ఫ‌స్ట్ టైం డ‌బ్బింగ్ చెప్పారు క‌దా..కంటిన్యూ చేస్తారా..?

తెలుగులో డ‌బ్బింగ్ చెబితే బాగుంటుంద‌ని నా మ‌న‌సులో మాట‌ను డైరెక్ట‌ర్ వంశీకి చెప్పాను. వెంట‌నే వంశీ ఓకే అన్నారు. డ‌బ్బింగ్ చెప్ప‌డం కంటిన్యూ చేస్తారా అంటే...పాత్ర డిమాండ్ చేస్తే...నేను చెబితే బాగుంటుంది అని అనిపిస్తే చెబుతాను.

నాగార్జున గారు చేసిన వీల్ ఛైర్ లో కూర్చొనే క్యారెక్ట‌ర్ చేసే అవ‌కాశం వ‌స్తే మీరు చేస్తారా..?

ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా క‌ష్టం. చేతులు - కాళ్లు క‌ద‌ల‌కుండ‌..కేవలం ఎక్స్ ప్రెష‌న్స్ మాత్ర‌మే ఇవ్వాలంటే మామూలు విష‌యం కాదు. నాగార్జున గారు ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ క్యారెక్ట‌ర్ చేసారు. ఆయ‌న్ని చూసి చాలా మంది న‌టులు స్పూర్తి పొందుతారు. తెలుగు సినిమాని ఊపిరి మార్చేస్తుంది.

నాగ చైత‌న్య - నాగార్జున ఇద్దరితో న‌టించారు క‌దా..ఇద్ద‌రిలో మీరు గ‌మ‌నించింది ఏమిటి..?

ఇద్ద‌రు - ఇద్ద‌రే...నాగార్జున గారిలో నిజాయితీ, హుందాత‌నం, స‌హ‌నం ఉన్నాయి. ఇవి చైత‌న్య‌లో కూడా చూసాను. నాగ్ సార్, చైత‌న్య ఇద్ద‌రితో న‌టించ‌డం సంతోషంగా ఉంది.

బాహుబ‌లి 2 లో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

బాహుబ‌లి 2 లో నా క్యారెక్ట‌ర్ త‌క్కువుగానే ఉంటుంది. షూటింగ్ ఎప్పుడు ఎక్క‌డ అనేది ఇంకా తెలియ‌దు. ఇలాంటి సినిమాలో పాత్ర నిడివి చిన్న‌దా..? పెద్ద‌దా అని కాదు న‌టించ‌డ‌మే గ్రేట్ అని నా ఫీలింగ్.

ఇన్నాళ్ల మీ కెరీర్ లో ఈ పాత్ర నేను చేయ‌లేక‌పోయాను అని ఫీలైన‌ సంద‌ర్భాలు ఉన్నాయా..?

ప్ర‌భాస్ న‌టించిన మిస్ట‌ర్ ప‌ర ఫెక్ట్ సినిమాలో న‌టించాలి. కానీ డేట్స్ ప్రాబ్లం వ‌ల‌న కుద‌ర‌లేదు. మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ నా ఫేవ‌రేట్ మూవీ. ఓ మంచి సినిమాని మిస్ అయ్యాన‌ని ఫీల‌వుతుంటాను.

ఊపిరి సినిమాలో కార్తీ - త‌మ‌న్నా క‌ల‌సి డ్యూయెట్స్ పాడుకుంటుంటే జెల‌సీగా ఫీల‌య్యాన‌ని నాగార్జున అన్నారు. మీరేమంటారు..?

ఊపిరి లో కుద‌ర‌క‌పోతే ఏంటండి...ఊపిరి - 2 లో నాగ్ సార్ తో డ్యూయెట్స్ చేస్తాను (న‌వ్వుతూ...)

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?

త‌మిళ్ లో ధ‌ర్మ‌దొరై మూవీ చేస్తున్నాను. బాహుబ‌లి 2 చేస్తున్నాను. ప్ర‌భుదేవా రూపొందిస్తున్న‌ త్రిభాషా చిత్రంలో న‌టిస్తున్నాను.