ఊపిరి పై కొనసాగుతున్న స్టార్స్ ప్రశంసల వర్షం

  • IndiaGlitz, [Saturday,March 26 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ త‌మ‌న్నా క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. వంశీ పైడిపల్లి తెర‌కెక్కించిన ఊపిరి చిత్రానికి సామాన్యులు, సినీ విమ‌ర్శ‌కులు, సినీ ప్ర‌ముఖులు నుంచే కాకుండా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంది.
నిన్నరాజ‌మౌళి, మ‌లినేని గోపీచంద్, దేవ క‌ట్టా, రైట‌ర్ గోపీ మోహ‌న్, హీరో సూర్య‌, అఖిల్, సుషాంత్, ల‌క్ష్మీ మంచు, కెమెరామెన్ సెంథిల్ కుమార్, ఎస్.ఎస్. కార్తీకేయ‌, నితిన్, సందీప్ కిష‌న్ త‌దిత‌రులు ఊపిరి చిత్రం పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తే...నేడు సూపర్ స్టార్ మ‌హేష్, అనుష్క‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌, ప్ర‌భుదేవా త‌దిత‌రులు బ్రిలియంట్ ఏక్టింగ్ & బ్రిలియంట్ డైరెక్ష‌న్ అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ అంటూ ఊపిరి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డం విశేషం.