నాగ్ , కార్తీ ల మూవీ టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున, కార్తీ కాంబినేషన్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీకి ఊపిరి అనే టైటిల్ కన్ ఫర్మ్ చేసారు. ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో పి.వి.పి సంస్థ నిర్మిస్తోంది. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అందాల తార అనుష్క ముఖ్య అతిధిగా నటిస్తుంది.
ఈ చిత్రానికి దోస్త్, మిత్రులు టైటిల్స్ లో ఏదో ఒకటి పెడతారని ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా ఊపిరి అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నాగార్జున ఈ చిత్రంలో వీల్ ఛైర్ లో కూర్చునే పేషంట్ గా నటిస్తున్నారు. కార్తీ నాగ్ ను చూసుకునే కేర్ టేకర్ గా నటిస్తున్నారు. నాగార్జున చేస్తున్న మరో ప్రయోగం ఊపిరి. మరి... తెలుగు తెర పై ఎన్నో ప్రయోగాలు చేసిన సైల్యూలాయిడ్ సైంటిస్ట్ నాగార్జునకు ఊపిరి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో...తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com