ఊపిరి కి ఫోర్బ్స్ పత్రిక అభినందన....

  • IndiaGlitz, [Monday,March 28 2016]

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా క‌లిసి న‌టించిన ఊపిరి చిత్రం యు.ఎస్ లో రికార్డ్ స్ధాయి కలెక్ష‌న్స్ సాధిస్తుంది. గ‌తంలో తెలుగు సినిమా యు.ఎస్ లో రిలీజ్ అవ్వ‌డ‌మే క‌ష్టంగా ఉండేది. అలాంటిది ప్ర‌జెంట్ యు.ఎస్ మార్కెట్ తెలుగు సినిమాకి మ‌రో నైజాం అయ్యింది. బాహుబ‌లి చిత్రం యు.ఎస్ లో హాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించింది. కొన్నివారాలా పాటు హాలీవుడ్ బాక్సాపీస్ లో టాప్ టెన్ లో బాహుబ‌లి నిలిచి సంచ‌ల‌న సృష్టించింది. ఇప్పుడు ఊపిరి చిత్రానికి కూడా యు.ఎస్ లో అదే స్ధాయిలో ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డం విశేషం. టాప్ టెన్ లో ఊపిరి లేక‌పోయినా...11వ స్ధానంలో నిలిచి అంద‌రికీ షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి.
ఈరేంజ్ స‌క్సెస్ తో దూసుకెళుతున్న ఊపిరి చిత్రం గురించి ప్ర‌ముఖ ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాగ‌జైన్ ఫోర్బ్స్ ప‌త్రిక ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించ‌డం విశేషం. యు.ఎస్ లో 163 స్ర్కీన్స్ లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూ ఊపిరి 9.1 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. టాప్ టెన్ కి కొద్దిదూరంగా టాప్ 11లో నిలిచింద‌ని ఫోర్బ్స్ ప‌త్రిక పేర్కొంది. హాలీవుడ్ మూవీ బ్యాన్ మ్యాన్ వెర్షెస్ సూప‌ర్ మ్యాన్, బాలీవుడ్ మూవీ రాకీ హ్యాండ్సమ్ చిత్రాలకు ఊపిరి గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని ఫోర్బ్స్ ప‌త్రిక పేర్కొన‌డం విశేషం.ఫ‌స్ట్ వీక్ లో రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించిన ఊపిరి ఫుల్ ర‌న్ లో 2 మిలియ‌న్ మార్క్ ని క్రాస్ చేస్తుంద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మ‌రి...
ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

'అ..ఆ..'తోనైనా త్రివిక్రమ్ ట్రాక్ మారుస్తాడా?

మాటలతో మాయ చేయడం ఎంతబాగా తెలుసో..దృశ్యాలను కూడా ఆకట్టుకునేలా తీయడం రచయిత,దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అంతే బాగా తెలుసు.

బాహుబ‌లి కి సి.ఎం, జ‌గ‌న్ అభినంద‌న‌లు..

తెలుగు సినిమా కీర్తిని విశ్వ‌వ్యాప్తం చేసిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన ప్రాంతీయ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి రికార్డ్ స్ధాయిలో దాదాపు 600 కోట్లు వసూలు చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

బాహుబలి, కంచె చిత్రాలను ప్రశంసించిన దాసరి

63వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమా తన సత్తాను చాటింది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించిన ‘బాహుబలి’ ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు సాధించగా, రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘కంచె’ ఉత్తమ పాంతీయ చిత్రంగా అవార్డును కైవసం చేసుకుంది.

'ఊపిరి' చిత్రాన్ని అభినందించిన దర్శకరత్న

తెలుగు, తమిళ భాషల్లో ఈ మార్చి 25న విడుదలైన ‘ఊపిరి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

హారర్ ఎంటర్ టైనర్ 'శశికళ' ట్రైలర్ విడుదల

గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్ టైనర్ ను తెలుగులో "శశికళ" పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.