'సీతారామ‌రాజు'తో 'ఊపిరి'కి లింకేంటి?

  • IndiaGlitz, [Monday,November 09 2015]

అక్కినేని కుటుంబంలో రెండో త‌రం న‌టుడు నాగార్జున‌.. నంద‌మూరి ఫ్యామిలీలో రెండో త‌రం న‌టుడు హ‌రికృష్ణ క‌లిసి న‌టించిన సినిమాగా 'సీతారామ‌రాజు'కి ప్ర‌త్యేక స్థానం ఉంది. 1999లో విడుద‌లైన ఈ సినిమా ఇరు కుటుంబాల అభిమానుల‌నే కాదు.. స‌గ‌టు తెలుగు ప్రేక్ష‌కుల‌ను సైతం అల‌రించింది.

ఆ సినిమాకి ముందు, త‌రువాత కూడా నాగ్ కొన్ని మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టించినా.. 'ఊపిరి'ని మాత్రం 'సీతారామ‌రాజు'తో లింక్ చేస్తున్నారు ప‌రిశీల‌కులు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. అదేమిటంటే.. 'ఊపిరి'కి వినిపిస్తున్న రిలీజ్ డేట్ ఫిబ్ర‌వ‌రి 5నే.. 'సీతారామ‌రాజు' కూడా విడుద‌లై విజ‌యం సాధించి ఉండ‌డం. మ‌రి 'సీతారామ‌రాజు' స‌క్సెస్ సెంటిమెంట్ 'ఊపిరి'కి కూడా కంటిన్యూ అవుతుందేమో చూడాలి.

More News

'అ..ఆ..' కోసం స‌మంత డ‌బ్బింగ్‌?

తెలుగు భాష‌ని స్ప‌ష్టంగా మాట్లాడే ప‌ర‌భాష ముద్దుగుమ్మ‌ల‌లో స‌మంత‌ది ప్ర‌త్యేక స్థానం. త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో మ‌రింత‌మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న ఈ చిన్న‌ది.

లోఫర్ ట్రైలర్ చెప్పే కథ ఇదే..

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోఫర్.ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు.త్వరలో లోఫర్ మూవీని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

కృష్ణ 'గాజుల కిష్ట‌య్య‌'కి 40 ఏళ్లు

సూప‌ర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ చిత్రంగా నిలిచింది 'గాజుల కిష్ట‌య్య‌'. క‌థ ప‌రంగానూ, సంగీతం ప‌రంగానూ అప్ప‌టి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కి నోచుకున్న ఈ సినిమాకి నాటి మేటి ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సారీ..అంటున్నఆలీ..

కామెడీ కింగ్ ఆలీ ఆడియో వేడుక‌ల్లో...హీరోయిన్స్ పై సెటైర్స్ వేస్తూ...వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో...హీరోయిన్ స‌మంత‌, యాంక‌ర్ సుమ ల‌పై సెటైర్స్ వేసి సంచ‌ల‌నం స్రుష్టించాడు.

సంక్రాంతి రేసులో సునీల్..

బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి నిర్మించే డిక్టేటర్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.